Made In India Car: ఈ మేడ్-ఇన్-ఇండియా కారు.. 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి..
- ఇటీవల ఇ-విటారా విడుదల
- గుజరాత్‌లో కార్ల తయారీ
- వందకు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతీ సుజుకి ఇండియాకు చెందిన ఇ-విటారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV). ఈ గ్లోబల్ మోడల్ కారు.. ఇ-విటారా మొత్తం మారుతీ సమూహానికి చాలా ముఖ్యమైనది.ఈ కారును మారుతీ కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తుంది. దీన్ని జపాన్‌తో సహా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది యూరోపియన్ దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతోంది. ఫోర్డ్ ఫిగో తర్వాత భారతదేశం నుంచి జపాన్‌కు ఎగుమతి చేయబడుతున్న రెండవ మారుతి ఎస్‌యూవీ ఇది.
గుజరాత్ ప్లాంట్‌లో తయారు..
ఈ ఏడాది నుంచే మారుతీకి చెందిన ఇ-విటారా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ తన గుజరాత్ ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఈవీలను అందించడానికి నాల్గవ లైన్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7,50,000 యూనిట్లు. ఈవీ యొక్క నాల్గవ లైన్ గురించి మారుతి నుంచి ఇంకా అధికారిక ప్రకటన లేదు. అయితే.. భారతదేశంలో ఈవీల తయారీలో నంబర్ వన్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారులో మీరు ప్రత్యేక ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Also Read
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
7 ఎయిర్‌బ్యాగ్‌లు..
ఇ-విటారా ముందు భాగంలో Y-పరిమాణ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లను కలిగి ఉంది. వెనుకవైపు 3-పీస్ లైటింగ్ ఎలిమెంట్‌తో కనెక్ట్ చేస్తూ..ఎల్‌ఈడీ టెయిల్ లైట్‌ని అమర్చారు. దీని ముందు బంపర్ పెద్దగా ఆకర్శణీయంగా ఉంది. ఇందులో ఫాగ్ లైట్లు ఉన్నాయి. క్యాబిన్ లోపల, విభిన్న టెర్రైన్ మోడ్‌ల కోసం రోటరీ డయల్ కంట్రోల్‌తో కూడిన సెంటర్ కన్సోల్, సన్‌రూఫ్, హిల్ హోల్డ్, ఆల్ వీల్ డ్రైవ్ అందించారు. ఈ ఇ-విటారా గ్లోబల్ స్పెక్ వెర్షన్‌లో కనిపించే మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించారు.
కొత్త సుజుకి ఇ-విటారా ఫీచర్లు
డిజైన్ వారీగా.. ఇ-విటారా చుట్టూ మందపాటి క్లాడింగ్, చంకీ వీల్ ఆర్చ్‌లు, Y-ఆకారపు LED హెడ్‌ల్యాంప్‌లు, కనెక్ట్ చేయబడిన టెయిల్‌ల్యాంప్‌లు, మంచి క్వాలిటీతో కూడిన వెనుక బంపర్ ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఎడమ ఫెండర్‌పై అమర్చారు. వెనుక డోర్ హ్యాండిల్స్ సి-పిల్లర్‌పై ఉన్నాయి. ఇ-విటారాలో డ్యూయల్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్ 2 ADAS సూట్‌లతో కూడిన ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్ లభిస్తుంది.
బ్యాటరీ ప్యాక్- రేంజ్..
కంపెనీ మారుతి ఇ-విటారాను రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లతో (49kWh – 61kWh) పరిచయం చేసింది. దీనిలో, పెద్ద బ్యాటరీ ప్యాక్‌కి డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సెటప్ ఇచ్చారు. దీనికి కంపెనీ ఆల్ గ్రిప్-E అని పేరు పెట్టింది. ఇది చైనీస్ కార్ కంపెనీ బిల్డ్ యువర్ డ్రీమ్ (BYD) నుంచి తీసుకున్న బ్లేడ్ సెల్ లిథియం ఐరన్-ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఫ్రంట్ యాక్సిల్‌పై ఒకే మోటారుతో 49kWh బ్యాటరీ 144hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సింగిల్-మోటార్ పెద్ద 61kWh బ్యాటరీ ప్యాక్ 174hp వరకు పవర్ అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ రెండు వెర్షన్లు 189Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, e-AllGrip (AWD) వేరియంట్ వెనుక యాక్సిల్ వద్ద అదనంగా 65hp మోటారును జోడిస్తుంది. దీని కారణంగా మొత్తం పవర్ అవుట్‌పుట్ 184hpకి, టార్క్ 300Nmకి పెరుగుతుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!