2008 డీఎస్సీ అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలకు పరిశీలకులను నియమించింది. నవంబర్ 8వ తేదీ లోపు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. నిర్ణీత ప్రొఫార్మాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని సూచించింది.
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవ సంబరాలను.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోను ఘనంగా జరుపుకున్నారు. పట్టణానికి చెందిన జనగం ఉదయ్ కిరణ్.. డొనాల్డ్ ట్రంప్ కు వీరాభిమాని. ట్రంప్ పుట్టినరోజు వేడుకలతో పాటు.. పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు. బుధవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం డొనాల్డ్ ట్రంప్ రెండవ సారి భారీ మెజార్టీ సాధించడంతో ఉదయ్ కిరణ్.. పట్టణంలోని ఇందిరా చౌక్ లో స్నేహితులతో కలిసి భారీ కేక్ కట్ చేసి బాణాసంచా…
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు.
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం ప్రజా భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు.
బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీటీఎం లేఅవుట్లోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా తనను వేధించారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆరోపించింది. పని పూర్తి చేసుకునిఇంటికి తిరిగి వస్తుంది నేహా బిస్వాల్ అనే యువతి. అకస్మాత్తుగా ఓ బాలుడు సైకిల్‌పై ఆమె వద్దకు వచ్చి రొమ్ముపై టచ్ చేసి.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో నేహా ఒక వీడియో బ్లాగ్ రికార్డ్ చేస్తోంది.
చిట్టీల పేరుతో 20కోట్ల రూపాయల మోసానికి పాల్పడి అదృశ్యమైన దంపతులు తమకు తామే పోలీసుల ముందు ప్రత్యక్షమైన ఘటన వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో నిందితులు బాపూజీ నగర్ కు చెందిన అమరేందర్ యాదవ్ (53), సబిత (49) దంపతులు అందరికీ నమ్మకంగా గత 20ఏళ్లుగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఐతే ఇటీవలి కాలంలో చిట్టీ పాట పాడికున్న వారికి చిట్టి డబ్బులు ఇవ్వకుండా సతాయించడమే కాకుండా గత నెల 14న దంపతులు ఇద్దరూ…
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.
ఆర్ & బీ రివ్యూలో అధికారుల పని తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్ర మత్తు వీడి రోడ్ల రిపేర్లు చేయాలని ఆదేశించారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రిపేర్లు చేయకుండా మీనమేషాలు లెక్కించడం ఏంటి? అని ప్రశ్నించారు.
విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదని.. అది ఓ మతతత్వ పార్టీ అని మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపించారు.
కుల గణనపై ఎన్నికలకు ముందే.. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్తున్నారని.. కుల గణనతో వనరులు, ఆస్తులు సమానంగా అందాలీ అనేది తమ విధానమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఐనా కొద్ది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి మాత్రమే ఫలాలు అందాలని అనుకునే వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమగ్ర సమాచారం వస్తే.. సంపద ఇంకా ఎంత మందికి అందలేదు అనేది తెలుస్తుందని చెప్పారు.