భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, సహచరుడు విల్మోర్ బుచ్ అంతరిక్షంలో చిక్కుకుని చాలా నెలలు అయ్యింది. ఇద్దరు వ్యోమగాములు జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా, ఇద్దరూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తిరిగి వచ్చే అవకాశం ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు కాన్ వాయ్ సన్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో తన కచేరీలో.. అతడు వేదికపై బహిరంగంగా కోడిని కత్తితో చంపేసి ఆపై దాని రక్తాన్ని పిండుకుని తాగాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు.
ఇది ఆన్లైన్ యుగం. పెళ్లి షాపింగ్ మాత్రమే కాదు.. వధువరులను కూడా ఆన్లైన్లోనే ఎంచుకుంటున్నారు. ఇంతకుముందు ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు.. కుటుంబ సభ్యులు అబ్బాయిలు, అమ్మాయిలను చూసేందుకు వెళ్లేవారు. ఏడు తరాలు చూసేవారని చెబుతారు. కానీ ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్లు వచ్చాయి. ఆన్లైన్లో సౌకర్యవంతంగా ఇంట్లో కూర్చుని పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురును వెతక వచ్చు. వారితో ఇంటరాక్ట్ అవ్వొచ్చు.
ఫ్లైట్‌లో ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి క్లిప్‌లో ఉన్న విమానం భూమి నుంచి వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విమానం అత్యవసర తలుపును ఒక వ్యక్తి అకస్మాత్తుగా తెరవడానికి ప్రయత్నిస్తాడు.
సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేమని కోర్టు పేర్కొంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమాలను మధ్యలో మార్చలేమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.
విమానాశ్రయంలో ఉద్యోగం పొందాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) అమృత్సర్ స్టేషన్‌కు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండిమాన్, డ్యూటీ ఆఫీసర్, డ్యూటీ మేనేజర్‌తో సహా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఢిల్లీలోని ట్రూకాలర్ యాప్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ విచారణ చేపట్టింది. ఆదాయపు పన్ను శాఖ ట్రూకాలర్ కార్యాలయం, దానికి సంబంధించిన క్యాంపస్‌లో సోదాలు నిర్వహించింది. కంపెనీ బదిలీ ధర నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది. దీని కోసం ఆదాయపు పన్ను ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. స్వీడన్ ఆధారిత ట్రూకాలర్ భారతదేశంతో సహా అనేక దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది.
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో 25 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక గురుద్వారా బాబా అటల్ రాయ్ ఏడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన విజయం సాధించారు. 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన ట్రంప్.. అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శించింది.
కుల గణన, మూసి ప్రక్షాళనపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ భేటీలో చర్చ జరిగింది. మూసి ప్రక్షాళనపై సీఎంతో గవర్నర్ ఆరా తీశారు. పేదలు నష్టపోకుండా చూడాలని.. పరిహారం అందించడంలో ఉదారంగా ఉండాలని సీఎంకి గవర్నర్ సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినట్లు సీఎం ఆయనకు తెలిపారు.