తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు.
రామంతపూర్ ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీకి చెందిన పలువురు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా.. తమ గ్రామానికి ఇంత వరకు తారు రోడ్డు నిర్మించక పోవడం దారుణమన్నారు.
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని యజమాని ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన అత్తాపూర్ హసన్ నగర్ లో చోటుచేసుకుంది. కొద్ది నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో యువతి పై కత్తితో దాడి చేయగా.. ఆమె చేతికి, తలకు కత్తి గాయాలయ్యాయి. గాయాల పాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు.
జాతీయ రహదారిపై పులి కనిపించింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటింది. రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు.. హడలెత్తిపోయారు. కారు, లారీ లో ప్రయాణిస్తున్న డ్రైవర్లుసెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ గండి కొట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల లెక్క తెలియకపోవడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు నియామకాల ప్రకారం బీసీ గణన నిర్వహిస్తున్నామన్నారు. కుల గణన ఎందుకు వద్దొ నేరుగా చెప్పండని కేటీఆర్ ని ప్రశ్నించారు. జీవో18 ప్రకారం మాదిరిగానే సర్వే జరుగుతోందని తెలిపారు. బీఆర్ఎస్ మాదిరి రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని మరోసారి స్పష్టం చేశారు.
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళతో లవ్ జిహాద్ ఉచ్చులో పడింది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఒకరితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత నిందితుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా అసభ్యకర వీడియోలు కూడా రూపొందించాడు. మతం మారి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బాధిత మహిళ దీనిని ఖండించడంతో, వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్థం. కానీ, ప్రస్తుత కాలంలో మూడు ముళ్ల బంధం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. చిన్న చిన్న మనస్పర్థలకే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం.
కాన్పూర్లోని బాబు పుర్వా ప్రాంతంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు ఫర్నీస్లో వండుతున్న పాల బాండీలో పడిపోయాడు. దీంతో తీవ్రంగా కాలిపోయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు దుకాణంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. సుమేర్పూర్ జిల్లా హమీర్పూర్కు చెందిన మనోజ్కుమార్ కాన్పూర్లోని కిద్వాయ్ నగర్ కూడలి సమీపంలోని హరి ఓం స్వీట్స్ దుకాణం వద్ద పాలపాన్ సమీపంలోకి వచ్చాడు.