రాబోయే కొన్ని రోజుల్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు శుభవార్త మీ కోసమే. ఫిబ్రవరి 2025 లో అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ ప్రసిద్ధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు ఉంటుంది. డిస్కౌంట్‌లో లభించే ఈ మోడళ్లలో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపుతో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా వర్తిస్తుంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
హోండా సివిక్..
ఫిబ్రవరి నెలలో హోండా సెడాన్ అమేజ్‌పై గరిష్టంగా రూ. 1.07 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపు అమేజ్ రెండవ జనరేషన్ మోడల్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇటీవలే కంపెనీ మూడవ తరం హోండా అమేజ్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
మహీంద్రా స్కార్పియో..
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ మహీంద్రా స్కార్పియో. ఇది ఫిబ్రవరి నెలలో లక్షల రూపాయల తగ్గింపును పొందుతోంది. 2024లో తయారు చేసిన స్కార్పియో క్లాసిక్ బేస్ ఎస్ ట్రిమ్‌పై గరిష్టంగా రూ. 1.25 లక్షల తగ్గింపు, MY 2024 స్కార్పియో ఎన్‌పై గరిష్టంగా రూ. 90,000 డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ..
మహీంద్రా థార్..
ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీలలో ఒకటైన మహీంద్రా థార్ ఫిబ్రవరి నెలలో రూ. లక్ష కంటే ఎక్కువ తగ్గింపును పొందుతోంది. MY2024 3-డోర్ థార్ పై గరిష్టంగా రూ. 1.25 లక్షల తగ్గింపు ప్రకటించారు.
మహీంద్రా బొలెరో..
ఫిబ్రవరి నెలలో డిస్కౌంట్‌తో కొత్త ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే, మహీంద్రా బొలెరో మీకు మంచి ఎంపిక! ప్రస్తుతం మహీంద్రా బొలెరోపై గరిష్టంగా రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు వస్తోంది. ఈ తగ్గింపు 2024 ఏడాదిలో తయారైన మోడళ్లపై అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి విటారా..
మారుతి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటైన గ్రాండ్ విటారాపై కూడా తగ్గింపు అందిస్తున్నారు. గ్రాండ్ విటారా MY 2024 స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై గరిష్టంగా రూ.1.65 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. 2025లో తయారైన మోడళ్లపై రూ. 1.1 లక్షల డిస్కౌంట్ ఇస్తున్నారు.
వోక్స్‌వ్యాగన్ వర్టస్..
ఫిబ్రవరి నెలలో వోక్స్‌వ్యాగన్ యొక్క ప్రసిద్ధ సెడాన్ వెర్టెస్‌పై లక్షల రూపాయల తగ్గింపు కూడా లభిస్తోంది. MY 2024 వోక్స్‌వ్యాగన్ వర్టస్‌పై గరిష్టంగా రూ. 1.70 లక్షల తగ్గింపు, MY 2025పై రూ. 80,000 వరకు తగ్గింపు ఇవ్వనున్నారు.
మారుతి సుజుకి జిమ్నీ..
మారుతి సుజుకికి చెందిన ప్రసిద్ధ ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీ జిమ్నీ ఫిబ్రవరి నెలలో రూ. 2 లక్షల వరకు తగ్గింపుతో వస్తుంది. 2024లో తయారైన జిమ్నీ ఆల్ఫా ట్రిమ్‌పై గరిష్టంగా రూ. 1.90 లక్షల తగ్గింపు లభిస్తుంది. 2025లో వేరియంట్‌పై రూ. 25,000 వరకు తగ్గింపును కంపెనీ ప్రకటించింది.
వోక్స్‌వ్యాగన్ టైగన్..
హ్యుందాయ్ క్రెటా, గ్రాండ్ విటారా వంటి ఎస్‌యూవీలతో పోటీ పడుతున్న వోక్స్‌వ్యాగన్ టిగన్ ఫిబ్రవరి నెలలో గరిష్టంగా రూ. 2.2 లక్షల వరకు తగ్గింపును పొందుతోంది. అయితే 2025లో తయారైన మోడళ్లపై కస్టమర్లు గరిష్టంగా రూ. 80,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
మారుతి సుజుకి ఇన్విక్టో..
మారుతి ఫ్లాగ్‌షిప్ ఇన్విక్టోపై కూడా వినియోగదారులు లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలలో MY 2024 మారుతి ఇన్విక్టో ఆల్ఫా వేరియంట్‌పై గరిష్టంగా రూ. 3,15 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే 2025 లో తయారైన మోడళ్లపై కస్టమర్లు గరిష్టంగా రూ. 2.15 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు.
మహీంద్రా XUV 400
మహీంద్రా అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XUV 400 పై కస్టమర్లు రూ.4 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ తగ్గింపు 2024లో తయారైన మహీంద్రా XUV 400 EL ప్రో వేరియంట్‌పై అందుబాటులో ఉంది.
గమనిక: మేము వివిధ ప్లాట్‌ఫారమ్‌లు, పలు ఛానెళ్ల సహాయంతో కార్లపై డిస్కౌంట్ల వార్తలను అందిస్తున్నాం. ఈ తగ్గింపు మీ నగరంలో లేదా డీలర్‌లో ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. మీరు కారు కొనడానికి ముందు, డిస్కౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోండి.