అస్సాంలో 10 నెలల చిన్నారిలో 'హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్' (HMPV) ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. అస్సాంలో ఇది మొదటి కేసు. ఈ మేరకు శనివారం అధికారులు సమాచారం అందించారు. దిబ్రూఘర్లోని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారని.. తన గాయాలకి పిఠాపురం ప్రజలు మందు వేశారని కొనియాడారు. జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని తెలిపారు. నేడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తిరుపతి ఘటన బాధాకరమని మంత్రి సవిత అన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆమె మాట్లాడుతూ.. "తిరుపతి ఘటనలో కుట్రపూరితంగా చేశారని అంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కావాలని చేశారని అంటున్నారు. క్లారిటీ వచ్చాక ఈ విషయాలపై మాట్లాడతాం. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు.
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ లో కూడా కోచ్లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్లు, 17 చైర్ కార్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందన్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి వారిని […]
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అనంతపురం రేంజ్ డీఐజీ తెలిపారు. 2500 మంది సిబ్బందితో పది రోజులు పాటు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మొన్న జరిగిన ఘటన పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఉహించనిదన్నారు. భక్తుల భద్రతపై పూర్తి భరోసా పోలీసు శాఖ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై భక్తులు వద్ద ఏమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని.. దర్యాప్తు సహకరించాలని కోరారు.
గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన విషయం తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్నా నేపథ్యంలో.. వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ వేళ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ ప్రత్యేక వైకుంఠం ద్వార దర్శనం చేయించింది.