ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో దాదాపుగా నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ పండగ సీజన్ కావడంతో భారీగా వస్తున్న వాహనాలని క్రమబద్ధీకరించడం పోలీసులకు భారంగా మారింది. తనికెళ్ల సమీపంలో హైదరాబాద్ నుంచి ఒడిస్సా వెళ్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సును వెనకవైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ట్రావెల్ బస్సు ముందు మరో వాహనాన్ని(లారీ) ఢీకొట్టింది. వెనకనుంచి వచ్చిన లారీ మళ్లీ మరొక లారీని ఢీకొట్టడంతో రోడ్డుపైన నిలిచిపోయాయి.
READ MORE: Jangaon District: రూ.300ల కోసం హత్య.. బండరాయితో కొట్టి నిప్పంటించిన స్నేహితులు
దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి భద్రాచలం అదేవిధంగా రాజమండ్రి భద్రాచలం నుంచి హైదరాబాద్ రూట్ వెళ్లే ప్రధానమైన రహదారి కావడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఉదయం నుంచి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.
READ MORE: Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ మూవీ స్పెషల్ షో.. కంగనను ప్రశంసించిన కేంద్ర మంత్రి