తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వచ్చాక జరుగుతున్నది ఏంటని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. "మీ పాలనలో మద్యం, మాసం తిరుమలలో పట్టుబడుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడింది.
చంద్రబాబు గత పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన చరిత్ర లేదని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.. గత వైసీపీ హయంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు.. జగన్ పేదల ఇళ్ల స్థలాల కోసం 15 వేల కోట్లతో భూములు కొనుగోలు చేశారన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పేదల స్థలాల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు..
వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుడు... వృద్ధురాలు.. ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. రాజమండ్రి లాలాచెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ అరుదైన వివాహం జరిగింది. వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ... రాజమండ్రి నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు.
హైబ్రిడ్ మోడల్లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్ పగ్గాలను రోహిత్ శర్మకే అప్పగిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్‌కు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. పవర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి అరగేట్రం చేశాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న.. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొంత ఉపశమనం లభించడంతో టీంలోకి ప్రవేశించాడు.
తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు వైసీపీని ప్రజలు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదన్నారు.
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ తో దూసుకెళుతూ వందకోట్ల క్లబ్ లో చేరింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కేవలం…
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కియా ఈవీ6 కారును విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ధర మార్చి 2025లో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది దక్షిణ కొరియా తయారీదారు కియాకు చెందిన నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇటీవల లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. 2025 మోడల్‌ను అప్డెట్ చేశారు. కియా EV6 డిజైన్, సాంకేతికత, పనితీరు గురించి తెలుసుకుందాం..
హోండా తన పాపులర్ డియో స్కూటర్ యొక్క 2025 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,930గా నిర్ణయించింది. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే దాదాపు రూ. 1500 ఎక్కువ. 2025 వెర్షన్లో జపాన్ కంపెనీ దానిలో పలు మార్పులు చేసింది. OBD2B కంప్లైంట్ ఇంజిన్‌ను అందించింది.
టాటా మోటార్స్ ఇటీవల పలు కార్లను కొత్త ఫీచర్లు, వేరియంట్లతో అప్డేట్ చేసింది. టియాగో, టిగోర్ తర్వాత కంపెనీ తన ప్రసిద్ధ ఎస్యూవీ టాటా నెక్సాన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నెక్సాన్ ఇంజన్ మెకానిజంలో ఎటువంటి మార్పు లేదు. కానీ దీనికి కొన్ని కొత్త ఫీచర్లు, వేరియంట్లు జోడించారు. కొత్త టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని పరిచయం చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (భారత్ మండపం)లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ప్రపంచానికి విడుదల చేసింది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. దీని పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..