హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మ ఆనందం’లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ఫస్ట్ -టైమర్ ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సంప్రదాయ పంచె కట్టులో సంతోషకరమైన చిరునవ్వుతో బ్రహ్మానందరం ఆకట్టుకున్నారు. కాగా.. ఈ చిత్రం వచ్చే నెల 14న థియేటర్లలోకి రానుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీలోపు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీకి నాయకత్వం వహిస్తారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 2024 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ అమిత్‌కు స్వాగతం పలికారు. సుమారు గంటకు పైగా సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షా ఉండనున్నారు. పలు కీక అంశాలపై వీరి మధ్య చర్చ జరగనుంది.
బీజాపూర్‌లోని పుజారి -కంకేర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో బడే చొక్కారావుతో పాటు 17 మంది మృతి చెందారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. బడే చొక్కా రావు, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. బడే చొక్కా రావు అలియాస్ (దామోదర్, మల్లన్న) ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి గ్రామవాసి. ఇతను మిలిటరీ చీఫ్‌గా కూడా పనిచేశాడు. చొక్కా రావు తల్లి బతుకమ్మ, తన కుమారుడు అజ్ఞాతంలో ఉన్నాడు. అతను ఇంటికి తిరిగి రావాలని కుటుంబీకులు…
మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. ఈ రోజు మధ్యాహ్నం 1గం.30 నిమిషాలు నుంచి 1గం.50 నిమిషాల మధ్య డ్రోన్ ఎగిరింది. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం భవనంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది.
తొక్కిల లాంట, లడ్డూ కౌంటర్లలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. టీటీడీ బోర్డును కేంద్రం నివేదిక కోరింది. టీటీడీ చరిత్రలో కేంద్రం ఇలా జోక్యం చేసుకోవడం ఇదే మొదటి సారి. క్షేత్రస్థాయి పరిశీలనకు హోం శాఖ అధికారి సంజీవ్‌కుమార్ జిందాల్‌ను ప్రత్యేకంగా నియమించింది. రేపు, ఎల్లుండి రెండ్రోజులు సంజీవ్ జిందాల్ పర్యటించి వివరాలు సేకరించనున్నారు. టీటీడీ కూడా ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరమని.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. "ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. పర్యాటకులు మోసం చేస్తే రారు, పరిశుభ్రంగా లేకుంటే రారు, హత్యలు చెస్తే రారు..
అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం ఒక స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మున్సిపాలిటీలలో స్వచ్ఛతగా ముందుకు వెళ్లలేకపోయామని వెల్లడించారు. కడపలో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. "ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరు.. ఇంటికెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు..
సునామీ తరువాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) ఏర్పడిందని.. ప్రస్తుతం 68 ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందిస్తోందని ఎన్డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఐజీ నరేంద్ర సింగ్ తెలిపారు. 1995లో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం, కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.