పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. మామిడి, కోకో పంటల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు.
READ MORE: TMC MP: సీక్రెట్ మ్యారేజ్.. 65 ఏళ్ల పొలిటీషియన్ను పెళ్లి చేసుకున్న 50 ఏళ్ల మహిళా ఎంపీ..
మామిడి పంట కొనుగోలుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కోకో విషయంలో కూడా కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పంటల కొనుగోలుకు సంబంధించి, ప్రధానంగా పొగాకు.. మామిడి.. కోకో విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీస్కుంటున్నామని తెలిపారు.
READ MORE: Chevireddy Bhaskar Reddy: మద్యానికి నేను దూరం.. నన్ను లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు..