కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద దోచుకుని లోకల్ జీఎస్టీ వేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి మద్యం బాటిల్ మీద రూ.10 అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధనపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు. గాడిదలు కాయడానికే ఎమ్మెల్యే అయిపోతారని సెటైర్ వేశారు. సారాతో రాజీకీయాలేంటి ? అని మండిపడ్డారు. అధనపు వసూళ్లలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. గతంలో పలాస నియోజకవర్గంలో శివాజీ , ఆయన అల్లుడు అధనంగా లోకల్ అల్లుడు ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపణలు చేశారు.
READ MORE: AP Education Department: జూలై నుంచి ప్రతి పాఠశాలను తనిఖీ చేయనున్న అధికారులు.. ఎందుకంటే?
అందుకే పవన్ కళ్యాణ్ పెట్టిన పేరు అల్లుడు టాక్స్ అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.. పలాస నియోజకవర్గంలో 22 మద్యం షాపులు ఉన్నాయని తెలిపారు. రోజుకు సగటున 550 మద్యం , 350 బీర్ కేస్ లు విక్రయిస్తారన్నారు. రోజుకు 30 వేల బాటిళ్లు అమ్మకాలు జరుగుతాయని.. బాటిల్ పై అధనంగా రూ . 10 లోకల్ జీఎస్టీ పేరిట అక్రమ వసూళ్లు చేసి.. నెలకు రూ. 90 లక్షలు ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లోకల్ జీఎస్టీ అధనంగా యాడ్ అయ్యిందని ఎద్దేవా చేశారు.
READ MORE: Upcoming EV Cars: ఎంజీ నుంచి టాటా వరకు.. విడుదలకు సిద్ధమవుతున్న EV కార్లు ఇవే!