దేశంలో నిజమైన మధ్యతరగతి వర్గానికి చెందిన వారు ఎవరు? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “రెడ్డిట్”లో చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఒక పోస్ట్. నిజానికి.. ఓ రెడ్డిట్ పోస్ట్ భారతదేశంలో ఆర్థిక తరగతి విభజనపై చర్చకు దారితీసింది. ఓ యూజర్ తన ఇంటి పనిమనిషి కుటుంబం తన కంటే ఎక్కువ సంపాదిస్తోందని, పన్ను కూడా చెల్లించడం లేదని రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తుతుంది?
READ MORE: Ambati Rambabu: మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన.. మాజీ మంత్రి ఫైర్
ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న ఓ రెడ్డిట్ యూజర్ పనిమనిషి తన ఇంట్లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తోందని చెప్పాడు. ఆమె మూడు ఇళ్లలో పనిచేస్తూ ప్రతి నెలా రూ. 30,000 సంపాదిస్తుంది. రోజువారీ కూలీ అయిన ఆమె భర్త రూ. 35,000 సంపాదిస్తాడు. అతని పెద్ద కొడుకు చీరల దుకాణంలో పనిచేస్తూ రూ. 30,000 సంపాదిస్తాడు. ప్రస్తుతం కుట్టు మిషన్ నేర్చుకుంటున్న చిన్న కూతురు రూ. 3000 సంపాదిస్తుంది. ఆమె పూర్తిగా పని నేర్చుకున్నాక.. రూ. 15,000 నుంచి 20,000 సంపాదించగలదు. చిన్న కొడుకు ప్రస్తుతం ప్లంబర్ శిక్షణ పొందుతున్నాడు. ఇప్పుడు ఏం సంపాధించడం లేదు. కానీ.. పని పూర్తిగా నేర్చుకున్న తర్వాత నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000 సంపాదించగలడు. ఈ విధంగా పని మనిషి కుటుంబం మొత్తం ఆదాయం నెలకు రూ. 98,000.
READ MORE:
కొన్ని నెలల అనంతరం ఈ కుటుంబ ఆదాయం నెలకు రూ. 1.3 నుంచి 1.35 లక్షలకు పెరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వీళ్ల సంపాదనపై ఎటువంటి పన్ను లేదు. వారు అద్దెకు రూ. 6000 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పథకాల కింద ఈ కుటుంబానికి ఉచిత రేషన్ కూడా లభిస్తుంది. కేంద్ర గృహనిర్మాణ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో వారికి ఇల్లు కూడా అందించారు. వారసత్వంగా వచ్చిన భూమిని లీజుకు ఇచ్చి ప్రతి త్రైమాసికంలో రూ. 30,000 నుంచి రూ. 40,000 సంపాదిస్తున్నారు. “నేను ఆమె కుటుంబ సంపాదనపై సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే ఆమె తన జీవితమంతా కష్టపడి పనిచేసింది. కానీ నాకు ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. నిజంగా మధ్యతరగతికి చెందిన వారు ఎవరు? ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు” అని రెడ్డిట్ యూజర్ రాశాడు. జీతం పొందే ఉద్యోగుల ఖర్చులు, పన్నులు పెరుగుతున్నాయి. కానీ.. అనధికారిక రంగ ఆదాయాలకు పన్ను లేనందున వారి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరిలో మధ్యతరగతికి చెందిన వారు ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.