రాజస్థాన్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రార్థన సమయంలో ఇస్లామిక్ శ్లోకాలు (కల్మా) పఠించమని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోటలోని బక్షి స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో జరిగిన ఈ సంఘటన హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు చేపడతామని సంఘాల సభ్యులు హెచ్చరించారు. అయితే, ఆ ఫుటేజ్ చాలా సంవత్సరాల పాతదని పాఠశాల సిబ్బంది తెలిపారు.
READ MORE: Pawan Kalyan : అతనికి పవన్ కల్యాణ్ థాంక్స్.. పోస్ట్ వైరల్..
ఈ అంశంపై జిల్లా విద్యా శాఖ దర్యాప్తు ప్రారంభించింది. కోటా చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేతృత్వంలోని విచారణ బృందం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడింది. జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాఖాపరమైన మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. “నిన్న, ఒక పాఠశాలలో ముస్లిం మతపరమైన ప్రార్థనను పఠిస్తున్నట్లు చూపించే వీడియో మా వద్దకు వచ్చింది. ఆ వీడియో అందిన వెంటనే, విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. నివేదిక అందిన తర్వాత, తగిన చర్యలు తీసుకుంటాం. ఇది CBSE-అనుబంధ పాఠశాల కాబట్టి.. నివేదికను బోర్డుకు పంపుతాం” అని శర్మ చెప్పారు.
READ MORE: KCR Health Bulletin: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా తమ సంస్థలో “సర్వ ధర్మ ప్రార్థన” సంప్రదాయాన్ని అనుసరిస్తోందని, ఇక్కడ అన్ని మతాల ప్రార్థనలు జరుగుతాయని అన్నారు. తాను రిటైర్డ్ నావికాదళ అధికారినని, తన తండ్రి కూడా ఆర్మీలో పనిచేశారని, మూడు యుద్ధాలు చేశారన్నారు. విద్యకు మతం లేదు. మేము అన్ని మతాలను గౌరవిస్తూ సర్వ ధర్మ ప్రార్థన చేస్తామని చెప్పారు.