నిత్యం ఉదయాన్నే అనేక కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లను చూస్తునే ఉంటాం. విజయ, దొడ్ల, హెరిటెజ్ ఇలా అనేక రకాల ప్యాకెట్లు మార్కెట్లోని దుకాణాలు, హోటళ్లలో లభిస్తాయి. కానీ ఒక హోటల్‌ల్లో మాత్రం తినుబండరాలతో పాటు ఎస్‌వీఎస్ బ్రాండ్ పేరుతో కల్లు ప్యాకెట్లు పట్టుబడటం ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ సిబ్బందిని అశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్‌లోని గుండ్ల పోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా హోటల్‌లో కల్లు అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో సీఐ సుబాష్ చందర్, ఎస్సైలు అఖిల్, రవిచంద్ర సిబ్బంది కలిసి హోటల్‌పై దాడి చేశారు. కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: Bandi Sanjay: ఆ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సిట్ నోటీసులు..
శంకర్‌గౌడ్ అనే వ్యక్తి హోటల్ నడిస్తున్నాడు. తన హోటల్లో తిను బండరాలతో పాటు 270 లీటర్ల కల్లు ప్యాకెట్లు లభ్యమైనట్లు సీఐ సుబాష్ చందర్ తెలిపారు. ఎస్‌విఎస్ కల్లు ప్యాకెట్లు ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. యజమాని మాత్రం దీనికి సమాధానం చెప్పడం లేదు. దీంతో నిందితుడు శంకర్ గౌడ్ తోపాటు కల్లు ప్యాకెట్లను మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మల్కాజి గిరిలో పరిధిలో అనుమతి లేకుండా అమ్మకాలు జరుపుతున్న 20 లీటర్ల కల్లును పట్టుకొని నేలపాలు చేశారు. మరోవైపు.. మల్కక్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సైదాబాద్ ప్రాంతంలో అనుమతి లేకుండా కల్లు అమ్మకాలు జరుపుతున్న ఇద్దరి వ్యక్తులతను ఏస్టీఎప్ ఏటీమ్ లీడర్ అంజి రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 750 లీటర్ల కల్లును స్వాధీనం చేసకున్నారు. కల్లు శాంపిల్‌ను తీసుకొని, పల్లె బిక్షపతి, బోడిగే శ్రీనివాస్ గౌడ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
READ MORE: Supreme Court: 12 ఏళ్ల చిన్నారి కథ విని చలించిన సుప్రీంకోర్టు.. తప్పును అంగీకరించిన న్యాయస్థానం..