Engineering Admission 2025: అలర్ట్.. ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ప్రైవేట్ కాలేజీల్లో 2025-26గానూ ఉన్నత విద్యామండలి ఈ షెడ్యూల్ విడుదల చేయగా.. జూలై 19నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అగస్టు 10 వరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. ఎప్‌సెట్, సీసీబీ, జోసా షెడ్యూల్‌కు అనుగుణంగా దీనిని రూపొందించారు. అప్లికేషన్లతో పాటు ఇతర వివరాల కోసం అధికార వెబ్‌సైట్ https://tgche.ac.in/ ను సంప్రదించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా కళాశాలలో సమర్పించవచ్చు. అభ్యర్థులు కళాశాల మేనేజ్‌మెంట్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కళాశాలలకు దరఖాస్తు చేయాలనుకుంటే, ప్రతి కళాశాలకు ప్రత్యేకంగా దరఖాస్తు, రుసుము చెల్లించాలి. అర్హత పరీక్షలో 50% మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్‌పై 5 CGPA సాధించిన NRI లేదా NRI స్పాన్సర్డ్ అభ్యర్థులను భర్తీ చేయవచ్చు. వీరికి సీట్లలో 15% వరకు అవకాశం కల్పించారు. ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఖాళీగా ఉన్న సీట్లను JEE (మెయిన్స్) ఆల్ ఇండియా ర్యాంక్ పొందిన అభ్యర్థులతో భర్తీ చేయాలి. వీరు అర్హత పరీక్షలో 45% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి. పైన పేర్కొన్న కేటగిరీల తర్వాత మిగిలిన సీట్లను TGEAPCET-2025లో అర్హత సాధించిన అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ఇంకా సీట్లు ఖాళీగా ఉంటే, అర్హత పరీక్షలో 45% (రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు 40%) మార్కులు సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలి.
ముఖ్యమైన తేదీలు (తాత్కాలిక షెడ్యూల్):
నోటిఫికేషన్ విడుదల: 19.07.2025
అడ్మిషన్ల ముగింపు: 10.08.2025.
అడ్మిషన్ జాబితాల సమర్పణ: 25.08.2025.
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!