Car Sales Slow Down: పండుగ సీజన్ కు ముందు కార్ల మార్కెట్ మందకొడిగా కనిపిస్తోంది. జూలైలో కార్ల అమ్మకాలు తగ్గాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా, హోండా వంటి పెద్ద కంపెనీల అమ్మకాలు తగ్గాయి. దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మహీంద్రా & మహీంద్రా, కియా అమ్మకాలు పెరిగాయి. కానీ డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో నిరాశ ఉందని నిపుణులు అంటున్నారు. కార్ల అమ్మకాల తగ్గుదలకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, అమెరికా విధించిన పన్నుల భయం, ఐటీ రంగంలో ఉద్యోగాల కోత వంటివి. ఈ కారణాలన్నింటి వల్ల ప్రజలు కారు కొనడానికి భయపడుతున్నారు.
READ MORE: Uttar Pradesh: భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. “అపరిచితుడి” రూపంలో బిగ్ ట్విస్ట్..
దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి ప్రస్తుతం డిమాండ్ బలహీనంగా ఉందని చెబుతోంది. కానీ పండుగ సీజన్ లో అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది. మొత్తం కార్ల పరిశ్రమ వృద్ధి లేదని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ అన్నారు. ప్రజలకు కారు కొనడం కష్టంగా మారుతోందని తెలిపారు. ముఖ్యంగా చిన్న కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయని వివరించారు. పండుగల సమయంలో మెరుగుదల సంకేతాలు కనిపిస్తాయని ఆయన ఆశిస్తున్నారు. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 10% తగ్గాయి. ఇటీవలి నెలల్లో డిమాండ్‌లో కొంత తగ్గుదల ఉందని కంపెనీ చెబుతోంది. హ్యుందాయ్ డైరెక్టర్, COO తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. “పండుగ సీజన్ ప్రారంభమైతే కార్లు అమ్ముడవుతాయని ఎదురు చూస్తున్నాం. అందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాం. మేము కొత్త మోడళ్లను కూడా ప్రవేశపెట్టబోతున్నాం.” అని వివరించారు.
READ MORE: PM Kisan Yojana: పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమ కాలేదా..? అయితే ఇలా చేయండి..
ఇప్పటివరకు డిమాండ్ బలహీనంగా ఉందని, అయితే పండుగల సమయంలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అన్ని కంపెనీలు చెబుతున్నాయి. అందుకు గాను కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అమ్మకాలను పెంచడానికి వినియోగదారులకు డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, ఇది కంపెనీల లాభాలను ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా చాలా కంపెనీలు ఉత్పత్తిని పెంచే ప్రణాళికలను నెమ్మదిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించిన తర్వాత ఈ అనిశ్చితి మరింత పెరిగిందని చెబుతున్నారు.