Fake Export Contract Scam: వ్యాపార అవకాశాలు కల్పిస్తాం.. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్తూ కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు… లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించిన కేటుగాళ్లు.. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను నిండా ముంచారు. B2B ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో ఓ వ్యాపారి నుంచి విడతల వారీగా కోటి పది లక్షలు కాజేశారు. మోసపోయాను అని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
READ MORE: Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు
హైదరాబాద్‌కి చెందిన వ్యాపారిని ఢిల్లీకి చెందిన ట్రేడ్ ఫండమెంటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన లక్ష్య వర్మ సంప్రదించాడు. స్పిరులినా పౌడర్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని నమ్మించాడు. వ్యాపారికి ACES ట్రేడింగ్ అనే హాంకాంగ్ ఆధారిత కంపెనీ వ్యక్తి అని మరొకరిని పరిచయం చేశాడు. కాంట్రాక్ట్ కోసం విడతల వారీగా కోటి 10 లక్షలు కాజేశారు. ఈ డబ్బు కూడా రీఫండ్ అవుతాయని మాయ మాటలు చెప్పారు. నెలలు గడుస్తున్నా కాంట్రాక్ట్ జాడలేదు..
READ MORE: Constable Suicide: కానిస్టేబుల్‌గా క్రిమినల్స్‌తో పోరాడింది.. కానీ భర్త వేధింపులకు బలైంది..?
మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన వ్యాపారి.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. కేటుగాళ్లు ఢిల్లీకి చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. వ్యాపారి నుంచి ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఫీజులు, కన్సల్టేషన్ ఛార్జీలు, పన్నులు ఇలా రకరకాల పేర్లు చెప్పి కోటి 10 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. ఢిల్లీకి చెందిన పరాస్ సింగ్లాను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు మహేష్ సింగ్లా, లక్ష్య వర్మ కోసం గాలిస్తున్నారు…