Odisha School Horror: ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ పాఠశాలలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్ళలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. దీంతో ఆ విద్యార్థుల కళ్ళు మూసుకుపోయాయి. గమనించిన ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన సెబాశ్రమ్ పాఠశాల హాస్టల్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశంపై కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించారు.
READ MORE: Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
స్థానికుల సమాచారం ప్రకారం.. కంధమాల్ జిల్లా ఫిరింగియా బ్లాక్‌లోని సలాగూడలో సేవాశ్రమ పాఠశాల ఉంది. ఇక్కడ, శుక్రవారం రాత్రి విద్యార్థులు హాస్టల్‌లో నిద్రిస్తున్నారు. కొంతమంది క్లాస్‌మేట్స్ 8 మంది విద్యార్థుల కళ్ళపై ఫెవిక్విక్ వేశారు. దీంతో కళ్ళు గట్టిగా మూసుకుపోయాయి. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది బాధిత విద్యార్థులను గోచ్చపాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఫుల్బాని జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి తరలించారు. శనివారం నాటికి ఒక విద్యార్థి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మరో ఏడుగురు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.
READ MORE: Anakapalli: ప్రేమ పరువు హత్య..? లవర్, ఆమె తల్లితో కలిసి అరుణాచలం వెళ్లిన యువకుడు.. అంతలోనే..
జిగురు వల్ల కళ్ళకు నష్టం వాటిల్లిందని వైద్యులు చెబుతున్నారు. అయితే, సకాలంలో చికిత్స అందించడం వల్ల ప్రమాదం తీవ్రత తగ్గిందని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత, జిల్లా యంత్రాంగం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును తక్షణమే సస్పెండ్ చేసింది. విద్యార్థుల కళ్ళలో ఫెవిక్విక్ ఎందుకు వేశారో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి కంధమాల్ సంక్షేమ అధికారి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి విద్యార్థులతో వివరణ తీసుకున్నారు. ప్రస్తుతం కలెక్టర్ సూచనల మేరకు దర్యాప్తు జరుగుతోంది.