విజయనగరం ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట నిలుకోలేదని.. ప్రజా వ్యతిరేఖ పాలన సాగిస్తోందన్నారు..
ఈ నెల 8న పామర్రులో వైసీపీ సమావేశం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ కార్యకర్తలను రప్పా రప్పా అని అనొద్దు అని చెప్పానన్నారు. అలా అనటం సంస్కారం కాదు అని చెప్పాను.. మన ఆస్తులను ధ్వంసం చేసి నిలువ నీడ లేని వారికి అట్టు పెడితే అట్టున్నర పెట్టాలని అన్నాను..
శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపేశారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా 15వ తేదీ నుంచి 18 వరకు ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
కడప జిల్లా బద్వేల్ లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయలేదని ఆరోపించారు.
బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కాదు మోసం గ్యారెంటీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. గుడివాడలో కార్యక్రమానికి నాయకులను రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ హారికను పోలీసులు అడ్డుకున్నారన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ యంత్రాలు అందజేశారు. 33మంది రైతులకు 80శాతం సబ్సిడీపై రూ.12లక్షల విలువైన గల వ్యవసాయ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు కులం ఉండదు... పార్టీ ఉండదు... రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. రైతులు పంటలు అమ్మకోవటానికి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీదగ్గరకే వస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ద్వారా రైతులకు లబ్ధి చేకూరటమే కూటమి ప్రభుత్వ…
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చిన ప్రజలను మోసం చేయడమే ఆయన నైజమని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు.
రూ.2000 నోట్లు రద్దు అనంతరం.. రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోటును నిషేధించబోతోందా? దీనికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ను ఎక్కువగా షేర్ చేయబడుతోంది. ఏటీఎంలలో రూ.500 నోట్లను క్రమంగా ఉంచడం ఆపాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించించినట్లు అందులో ఉంది. మార్చి 2026 నాటికి రూ.500 నోట్లు ఏటీఎంలలో ఉంచడం ఆగిపోతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు.
Shravan Masam 2025: తెలుగు పంచాంగం ప్రకారం.. గత రెండ్రోల కిందటే శ్రావణ మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు, శివుడు, శ్రీ హరి ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. శివ భక్తులు శివ మాల ధరించి, శివ భజన, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాదు వివాహిత మహిళలు వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శివయ్యకు శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు…
Banana Health Benefits: అరటిపండు ప్రతి సీజన్లో సులభంగా లభించే పండు. అన్ని వయసుల వారు దీనిని తినడానికి ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా.. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. కానీ ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారా? అనే ప్రశ్న కొందరిలో ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం.. నిజానికి అరటిపండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, మితంగా తీసుకోవడం చాలా కీలకమంటున్నారు నిపుణులు.