Hyderabad: అసలే మద్యం మత్తు.. ఆ తర్వాత గంజాయి కిక్కు.. ఆ నిషాలో ఏం చేస్తున్నారో తెలియదు. కానీ సామాన్య జనాన్ని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ సిటీలో ఇలాంటి పోకిరిల బెడద మరీ ఎక్కువైంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు ఉంటున్నారని సిటీజనం గగ్గోలు పెడుతున్నారు.
Begum Bazaar Fake Goods: తక్కువ ధరకే ఏ వస్తువైనా కొనుగోలు చేయాలి... అది కూడా బ్రాండెడ్ వస్తువు అయితే మరీ మంచిది. ఇలాగే ఉంటుందని మధ్యతరగతి జీవుల ఆలోచన. అందుకనే హైదరాబాద్‌లో ఉండే మిడిల్ క్లాస్ మ్యాగ్జిమమ్..బేగంబజార్‌లో ఇంటికి కావాల్సిన సామానులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి ఇక్కడ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక్కడ హోల్‌సేల్ రేట్లకు రిటైల్‌గా వస్తువులు దొరుకుతాయని జనం నమ్ముతున్నారు. కానీ సరిగ్గా దీన్నే ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు బేగంబజార్ కేటుగాళ్లు.…
Machilipatnam Robbery Gang: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తున్న ముఠా ఆటకట్టించారు కృష్ణాజిల్లా పోలీసులు. దీంతో మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న దొంగతనాలకు చెక్ పెట్టారు. భారీగా బంగారం, నగదును సీజ్ చేశారు. ఇక్కడ చూడండి.. గోల్డ్ చైన్లు, చెవి కమ్మలు, ఉంగరాలు, లాకెట్స్ లాంటి వాటితోపాటు వెండి వస్తువులు దొంగతనాలు చేస్తున్నారు.
తెలిసీ తెలియని వయసు.. ఇరువురి మధ్య ఆకర్షణ.. అదే ప్రేమ అనుకుంటారు. చదువుపై చూపించాల్సిన శ్రద్ధ కాస్తా.. మరోవైపునకు దారి మళ్లుతుంది. అదే సమయంలో పెద్దలు మందలిచినా.. కాస్తా కన్నెర్ర చేసినా లేత మనసు గాయపడుతుంది. అది ఏ విపరీత పరిణామానికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి ఘటనలే హైదరాబాద్‌లో జరిగాయి. ఒకే స్కూలులో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఉసురు తీసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Man Kills Wife : ఇప్పుడు దేశం మొత్తం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. భర్తలను చంపడమే పనిగా పెట్టుకున్నారు భార్యలు.. అంతేకాదు పెళ్లి చేసుకున్న నెల రోజులకే భర్తలను తీసుకెళ్లి చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తలను ట్రాప్ చేసి మరీ కడతేర్చుతున్నారు. అయితే ట్రెండ్‌కు భిన్నంగా హైదరాబాద్‌లో ఒక ఘటన జరిగింది. మరో వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను చంపేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. ఓ వైపు మేనకోడలు కూతురు పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగానే..…
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రాంతం.. క్రైమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. మొన్నటికి మొన్న ఏకంగా ఎంబసీ ఏర్పాటు చేసి నిరుద్యోగులను చీట్ చేస్తున్న వైట్ కాలర్ క్రిమినల్‌ను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా దోపిడీ దొంగలు సైతం ఘజియాబాద్‌ను గజగజా వణికిస్తున్నారు. ఇది.. ఘజియాబాద్‌లోని మాన్సి అనే జువెల్లరీ షాప్. ఈ షాపులోకి ఇద్దరు దోపిడీ దొంగలు చొరబడ్డారు. బ్లింక్ ఇట్, స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో షాపులోకి వచ్చారు. లోపలికి రాగానే అక్కడ ఉండే సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల…
Eating Bananas on an Empty Stomach: అరటి పండు.. చాలా మంది ఇష్టంగా తినే ఫ్రూట్. అరటి పండు రుచి తియ్యగా ఉంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అరటి పండును ఆస్వాదిస్తారు. అరటి పండుతో జ్యూస్, స్మూతీలు, స్వీట్స్, షేక్స్ వంటివి తయారు చేస్తారు. అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక…
Paracetamol Side Effects: వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో జబ్బులు బాగా పెరుగుతాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు అధికమవుతాయి. అయితే.. ఈ సీజన్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్‌కు మంచి గిరాకీ ఉంటుంది. మనకు ఏ చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి లాంటిది ఉన్నపుడు వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటాం. ఒంట్లో వేడి పెరిగినపుడు, తలనొప్పి, పంటి నొప్పి, బెణుకులు, జలుబు, ఫ్లూ లాంటివి ఇబ్బంది పెడుతున్నపుడు వీటి నుంచి సత్వర ఉపశమనం కోసం […]
కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. టీకా వల్ల గుండె జబ్బులు, గుండెపోటు కేసులు పెరిగాయని.. దీని వల్ల ఆకస్మిక మరణాలు పెరిగాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వివిధ అధ్యయనాలు దీని గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం (జూలై 25) లోక్‌సభలో క్లారిటీ ఇచ్చారు.
Conversion Racket Busted: అక్రమ మతమార్పిడి ముఠా అనేక రాష్ట్రాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఢిల్లీకి చెందిన సూత్రధారి అబ్దుల్ రెహమాన్ ఏడు రాష్ట్రాల నుంచి డజన్ల కొద్దీ బాలికలు, యువతులను ట్రాప్ చేసి మతమార్పిడి చేయించాడు. ఈ యువతులలో కొందరు ప్రస్తుతం ఈ ముఠా కోసం పనిచేస్తున్నారు. మతమార్పిడి చేసిన కొంతమంది యువతులను, వారి కుటుంబాలను పోలీసులు సంప్రదించారు. రాష్ట్ర పోలీసుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. బుధవారం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను జైలుకు పంపారు.