High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- కోడలి ఇంట్లో అత్తగారికి హక్కుంటుంది
- ఉమ్మడి ఇంట్లో చట్టపరమైన హక్కులుంటాయి
- హైకోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోడలి ఇంట్లో అత్తగారు కూడా నివసించే హక్కు ఉంటుందని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన సొంత సంపాదనతో కట్టుకున్న ఇంటిలోంచి వెళ్లిపోవాలని అత్తమామలకు కోడలి ఆదేశించడంతో బాధిత అత్తగారు గృహ హింస కింద కేసు పెట్టింది. విచారణ సందర్భంగా ఇల్లు కోడలి పేరు మీద ఉన్నప్పటికీ.. అక్కడ నివసించే హక్కు అత్తగారికి కూడా పూర్తిగా ఉంటుందని న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
మండి జిల్లాల్లోని రామ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో 2013, మే నెలలో వివాహం జరిగింది. 2014 వరకు అత్తమామలతోనే కోడలి నివసించింది. అయితే ఇంతలో వివాదాలు తలెత్తడంతో అత్తమామలను ఇంట్లో నుంచి గెంటేసింది. 2025, నవంబర్ 7న ఇంట్లో నుంచి పంపేసి అద్దెకు ఇచ్చేసింది. దీంతో అత్తగారు గృహ హింస కేసు పెట్టింది. అయితే తన సొంత సంపాదనతో నిర్మించుకున్న ఇల్లు అని దిగువ కోర్టులో కోడలు పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి రాకేష్ కాంతాలా విచారించి కొట్టేశారు. ఉమ్మడి ఇంట్లో అత్తగారికి హక్కు ఉంటుందని తెలిపింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
అయితే కోడలిపై అత్తగారు పెట్టిన గృహ హింస కేసు తాజాగా హైకోర్టులో విచారణ రాగా.. కోడలి ఇంట్లో అత్తగారికి నివసించే హక్కు ఉంటుందని.. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ఇరుపక్షాలు కలిసి నివసించినప్పుడు అందరికీ హక్కులు ఉంటాయని తెలిపింది. అత్తమామలు బయటకు పంపేసి అద్దెకు ఇవ్వడం ఏ మాత్రం సరైందని కాదని పేర్కొంది. గృహ సంబంధంలో నివసిస్తున్న ప్రతి మహిళకు, ఆమె కుమార్తె, సోదరి, భార్య, కోడలు, అత్త అయినా సరే.. ఉమ్మడి గృహంలో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఇల్లు కోడలి పేరు మీద ఉన్నప్పటికీ.. అక్కడ నివసించే హక్కు అత్తగారికి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!