ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. నేపాల్‌పై 57 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 57 పరుగుల ఇన్నింగ్స్‌తో 4 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్‌కు చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో రోఎలోఫ్ వాన్ డెర్ మెర్వ్ 11 స్థానాలు ఎగబాకి ఉమ్మడిగా 63వ స్థానంలో, లోగాన్ వాన్ బీక్ 3 స్థానాలు మెరుగై 76వ స్థానంలో నిలిచారు. నేపాల్ జట్టులో బౌలర్లు లలిత్ రాజ్‌బన్షి 45వ స్థానానికి, కరణ్ కెసి 83వ స్థానానికి చేరగా, బ్యాటర్ ఆసిఫ్ షేక్ 76వ ర్యాంక్‌కు చేరుకున్నారు.
నమీబియా క్రికెటర్ల ర్యాంకింగ్స్
లీగ్ 2 ట్రై సిరీస్‌లో పాల్గొన్న నమీబియాకు చెందిన నలుగురు ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. బ్యాటింగ్ జాబితాలో జాన్ ఫ్రైలింక్ 16 స్థానాలు మెరుగై 90వ ర్యాంక్‌కు, బౌలర్ రూబెన్ ట్రంపెల్మాన్ 87వ స్థానానికి చేరుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో బెర్నార్డ్ షోల్ట్జ్ 34వ ర్యాంక్‌కు, జెజె స్మిత్ 47వ ర్యాంక్‌కు ఎగబాకారు. ప్రస్తుతం వన్డే బౌలింగ్‌లో రషీద్ ఖాన్, ఆల్రౌండర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానాల్లో ఉన్నారు.
Also Read
- Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
- Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
- Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
- TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
టాప్-10లో భారత బ్యాటర్లు
వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్ ఆటగాడు డెరిల్ మిచెల్ రెండో స్థానంలో ఉన్నారు. భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్ ఐదో స్థానంలో, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఆరో స్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!