Moonlighting: ఇటీవల కాలంలో రెండు ఉద్యోగాలు ఒకేసారి చేస్తూ డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఓ కంపెనీలో పని చేస్తూ.. మరో కంపెనీలో రహస్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలా డబుల్ జీతం తీసుకునే వారు ఎక్కువయ్యారు. దీనినే “మూన్‌లైటింగ్” అని అంటారు. సాధారణంగా ఇది కంపెనీ పాలసీలను ఉల్లంఘించడం.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇది తీవ్ర నేరం. “మూన్‌లైటింగ్” తాజాగా అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన ఒక వ్యక్తిని పెద్ద ప్రమాదంలోకి నెట్టాయి.
READ MORE: EAM Jaishankar: ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై జైశంకర్ అసంతృప్తి
అమెరికా న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ వ్యవస్థలో కీలకమైన ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గోస్వామి 2022 నుంచే మాల్టాలోని ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ గ్లోబల్ ఫౌండ్రీస్‌లో రహస్యంగా కాంట్రాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు చోట్ల ఒకేసారి పని చేస్తూ, తన ప్రభుత్వ డ్యూటీ సమయాన్ని కూడా ప్రైవేట్ కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.
READ MORE: Tejashwi Yadav: మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ
అధికారులు గోస్వామి రెండు ఉద్యోగాలను ఒకేసారి నిర్వహిస్తూ దాదాపు 50,000 డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 44 లక్షల విలువైన ప్రభుత్వ నిధులను వంచించాడని గుర్తించారు. న్యూయార్క్ ప్రభుత్వ ఉద్యోగుల జీత సమాచారం వెల్లడించే సీథ్రూ-ఎన్‌వై వెబ్‌సైట్ ప్రకారం.. 2024లో అతడు రూ. కోటికి పైగా జీతం పొందినట్లు రికార్డ్ ఉంది. అయితే ప్రభుత్వానికి పని చేయాల్సిన సమయాల్లోనే ప్రైవేట్ కంపెనీ కోసం కూడా ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు ఇమెయిల్ రికార్డులు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నిజాయతీగా సేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గోస్వామి చర్యలు ఆ ప్రజా విశ్వాసాన్ని ఉల్లంఘించడమే కాకుండా పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేసినట్టు స్పష్టంగా చూపుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Virat Kohli: క్రికెట్కు కోహ్లీ గుడ్ బై.. ఘాటుగా స్పందించిన సునీల్ గవాస్కర్..
ఈ ఘటనలో అక్టోబర్ 15న గోస్వామిని అధికారికంగా అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ లేకుండా విడిచిపెట్టినప్పటికీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నేరం రుజువైతే గోస్వామికి గరిష్ఠంగా 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన అరెస్టుతో అమెరికాలోనే కాకుండా భారత ఐటీ ప్రపంచంలో కూడా మళ్లీ మూన్‌లైటింగ్ పై పెద్ద చర్చ మొదలైంది. డబ్బు కోసం రెండు ఉద్యోగాలు చేయడం చివరికి కెరీర్ మొత్తాన్నే నాశనం చేసే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.