Gujarat ATS Raids: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మంగళవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుదిన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. మూడు రకాల లిక్విడ్‌లతో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు. అనంతరం సామాగ్రిని సీజ్ చేశారు.
READ MORE: Revenge Story: తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తిపై కోపంతో..అతడి భార్యను ఎత్తుకెళ్లిన భర్త
ఇదిలా ఉండగా.. భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొహియుద్దీన్ అరెస్టుపై కుటుంబ సభ్యులు ఇటీవల స్పందించారు. మొహియుద్దీన్ సోదరుడు ఒమర్ ఫారూఖీ నిన్న(బుధవారం) ఎన్టీవీతో మాట్లాడాడు. తన సోదరుడు మంచోడని, ఎవరో కావాలనే కుట్రలో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన బ్రదర్ ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు తెలియదని చెప్పాడు. ఒకవేళ తమ సోదరుడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించండని ఒమర్ ఫారూఖీ అంటున్నాడు. ‘మా సోదరుడు మొహియుద్దీన్ ఎవరో ట్రాప్ చేసి ఈ కుట్రలో ఇరికించారు. మా బ్రదర్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు మాకు తెలియదు. నవంబర్ 5న బిజినెస్ డీల్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి గుజరాత్ బయల్దేరాడు. 9వ తేదీన ఏటీఎస్ వారు నాకు ఫోన్ చేసి మీ బ్రదర్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, అరెస్ట్ చేశాం అని చెప్పారు. మొహియుద్దీన్ నివాసాన్ని ముట్టొద్దు, 2 రోజుల్లో వచ్చి ఆయన రూమ్‌లో ఉన్న సామగ్రి స్వాధీనం చేసుకుంటాం అని ఏటీఎస్ పోలీస్ చెప్పారు. ఇంటికి ఏటీఎస్ పోలీసులు వచ్చారు, సామాన్లు సీజ్ చేసి తీసుకువెళ్లారు. ఏటీఎస్ అరెస్టు చేసినవారిలో మరో ఇద్దరు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహైల్ వారితో మాకు ఎలాంటి లింక్స్ లేవు’ అని అన్నాడు.
READ MORE: Amaravati Development: అమరావతి అభివృద్ధికి అదనపు రుణాలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..