MI Captaincy: “సూర్యను కెప్టెన్ చేయకపోతే హార్దిక్‌కు కష్టాలు తప్పవు”.. దిగ్గజ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI Captaincy: ఐపీఎల్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇక అన్ని జట్లు ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ (MI)లో గందరగోళం మొదలైంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే వాదనలు పెరిగాయి. తాజాగా ఈ అంశంపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. 2024లో రోహిత్ శర్మ నుంచి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పుడు హార్దిక్.. వైట్-బాల్ క్రికెట్లో భారత వైస్-కెప్టెన్‌గా ఉన్నాడని గుర్తు చేశాడు. అయితే, ఇప్పుడు పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి కెప్టెన్సీ బాధ్యతల్లో లేడని తెలిపాడు.. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై సారథ్య బాధ్యతలను సైతం సూర్యకు అప్పగించాలని అశ్విన్ పేర్కొన్నాడు. ఇటీవల సూర్య సారథ్యంలోని జట్టు టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుందని గుర్తు చేశాడు. ఇంకా ముంబై ఇండియన్స్ సూర్యకుమార్‌ను తమ శాశ్వత కెప్టెన్‌గా చేయకపోవడం ఆందోళనకరమని తెలిపాడు.
Also Read
- Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
- Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..
- Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
- Tesla Cybertruck: "మూడేళ్లకే కథ ముగిసింది".. టెస్లా 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
“సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉండటంలో ఆలోచించాల్సిన పనే లేదు. అతనికి కెప్టెన్సీ ఇవ్వాల్సిందే. ఇంకా కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోందని నేను ఖచ్చితంగా చెప్పగలను” అని అశ్విన్ తన హిందీ యూట్యూబ్ ఛానల్ ‘యాష్ కీ బాత్’లో వివరించాడు. ఇక పాండ్యా కెప్టెన్సీ సామర్థ్యాలను అశ్విన్ తప్పుపట్టలేదు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మొదటి సీజన్లోనే టైటిల్ గెలుచుకోగా, రెండో సీజన్లో జట్టు రన్నరప్‌గా నిలిచిందని గుర్తు చేశాడు. అతను ముంబైకి వచ్చినప్పుడు, కెప్టెన్‌గా అదే పరంపరను కొనసాగిస్తాడని అంచనా ఉండేది. అయితే, తొలి ఏడాది రోహిత్ శర్మ ఉదంతాన్ని చక్కబెట్టడానికే గడిచిపోయిందని అశ్విన్ అన్నాడు. ఇక ముంబై ఇండియన్స్‌కు వచ్చిన కొత్తలో రోహిత్ శర్మ కెప్టెన్సీ మార్పు వ్యవహారంతో హార్దిక్ కొంత ఒత్తిడికి లోనయిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోతే హార్దిక్ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మానసికంగా ఒక పెద్ద సవాలు అని అశ్విన్ విశ్లేషించాడు.
READ MORE: AI+ Nova 2 Ultra 5G: ఏఐ+ నోవా 2 అల్ట్రా 5జీ నోటిఫికేషన్ రింగ్ లైట్ ఫీచర్ తో.. రిలీజ్ కు రెడీ..
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!