Abhinav Mukund: “బ్యాటింగ్‌లో టాప్.. బౌలింగ్ ఫ్లాప్”.. SRH టీమ్‌పై భారత మాజీ క్రికెటర్ షాకింగ్ స్టేట్‌మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhinav Mukund: ఐపీఎల్ సీజన్ 2026కు కొన్ని రోజులే మిలిగి ఉన్నాయి. ఈ నెల 28న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోటీ ఉండనుంది. ఈ పోటీకి ముందు భారత మాజీ ప్లేయర్స్ ఎస్‌ఆర్‌హెచ్‌పై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ ఆలోచింపజేశాయి. 2025లో ఆశించినంతగా రాణించలేకపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కనీసం ప్లేఆఫ్స్‌కు అయినా చేరుకోవాలనే ఒత్తిడితో ఈ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ SRHకు ఉంది. అయితే.. బౌలింగ్ విభాగంపై సందేహాలు కొనసాగుతున్నాయి. కెప్టెన్, పేసర్ పాట్ కమిన్స్ తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉండగా, ఐపీఎల్ 2026 వేలానికి ముందు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ట్రేడ్ అయ్యాడు. దీనివల్ల పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా అనుభవం లేని ఆటగాళ్లపై పడే అవకాశం ఉంది. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ సంచలన వివరణ ఇచ్చారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్, బౌలింగ్ మధ్య ఉన్న బలాబలాల వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. “ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ 10కి 10 పాయింట్స్ ఉంటే.. బౌలింగ్ 10కి గానూ ఒకటిగా ఉంది. ఇది చాలా పెద్ద పతనానికి దోహదం పాడుతుంది.” అని ముకుంద్ ESPNcricinfo లో తెలిపారు.
Also Read
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్‌పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
“ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ ప్రత్యర్థి జట్లను దెబ్బతీస్తుంది. పైగా ఈ సీజన్‌లో అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఎస్‌ఆర్‌హెచ్‌దే. కేవలం ఆ ఒక్క కారణమే వారిని హైదరాబాద్‌లోని ఫ్లాట్ పిచ్‌పై ప్రమాదకరంగా మారుస్తుంది. కానీ బౌలింగ్‌లో పనితీరు చాలా పేలవంగా ఉంది. 24 ఏళ్ల ప్రఫుల్ హింగే , 23 ఏళ్ల ఓంకార్ తర్మలే, 21 ఏళ్ల షకీబ్ హుస్సేన్ వంటి ప్రతిభావంతులైన భారత పేసర్లను SRH కొనుగోలు చేసింది. కానీ.. వీరిలో ఎవరూ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ సైతం ఆడలేదు. ఫలితంగా, ఐపీఎల్ సీనియర్ ఆటగాళ్లైన జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాల్సి రావచ్చు. బౌలింగ్ లైనప్‌లో అనుభవం లేని ఆటగాళ్లు ఉండటం టీమ్‌ను కష్టాల్లోకి నెడుతుంది. ఆ టీమ్‌లో చాలామంది తమ సొంత ఫస్ట్-క్లాస్ జట్లలో కూడా చోటు సంపాదించుకోలేదు. చాలా మందిని కేవలం ట్రయల్స్‌లో ఆటగాళ్లను పరిశీలించి ఎంపిక చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టును చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎస్‌ఆర్‌హెచ్ బాగా రాణించిన సీజన్లలో భువనేశ్వర్ కుమార్ లేదా టి. నటరాజన్ బాగా ఆడారు. కానీ ఇప్పుడు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ ఈ బౌలింగ్ దళానికి ముందుండి నాయకత్వం వహించాల్సి ఉంటుంది.” అని అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌లో ఐపీఎల్‌లో ఆడని ప్లేయర్స్ చాలా మంది ఉన్నారని అభినవ్ ముకుంద్ తెలిపారు. వేలంలో చాలా డబ్బు ఖర్చు చేశారు. ఇప్పటికే మీ వద్ద క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ ఉన్నప్పటికీ, చివరికి ఆ డబ్బును లియామ్ లివింగ్‌స్టోన్‌పై ఖర్చు పెట్టారన్నారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్‌పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!