Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈసారి ప్రయోగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే, అఘోరీలు, నాగ సాధులు, రుషులతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అయితే, ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పేరు ‘మోనాలిసా’. ఆమె […]
Yoga Tips: యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును తగ్గించి, శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. యోగా సాధారణంగా అధిక తీవ్రత వ్యాయామం కాకపోయినా.. ఇప్పటికీ అనేక విధాలుగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇకపోతే, బరువు తగ్గాలనుకునే వారు కొన్ని యోగాసనాల సాధనను చేస్తే చాలు. అదికూడా కేవలం 10 నిమిషాల యోగా […]
Breaking News: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద 60 కేజీల గంజాయిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో గంజాయి తరలింపు జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు, అక్కడే గట్టి నిఘా పెట్టి దాడి నిర్వహించారు. దాడి సమయంలో 60 కేజీల గంజాయిని […]
Srinivas Goud: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో నేడు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి సాగునీటి రంగంలో చేసిన అన్యాయాలను గుర్తుచేస్తూ, వాటిని తవ్వితే పుట్టల నుంచి పాములు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు. తెలంగాణకు సాగునీటి రంగంలో కాంగ్రెస్ చేసిన పాపాలు తవ్వితే అన్ని విపత్తులుగా బయట పడతాయని శ్రీనివాస్ […]
Ganja Smuggling: హైదరాబాద్ కొండాపూర్ లోని ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కావలికు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజనగా గుర్తించారు పొలిసు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు గత కొంతకాలంగా ఆరుకు ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి, ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు, వారి […]
Minister Seethakka: హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజనతో పాటు అన్ని జిల్లాల డిఆర్డిఓల అధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై దిశానిర్దేశం చేస్తూ మంత్రి పలు కీలక సూచనలు చేశారు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామన్న మంత్రి, […]
KNRUHS: వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అధికారుల నిర్లక్ష్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న నిర్వహించిన పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షలో 2023 నవంబర్‌లో వాడిన పాత ప్రశ్నపత్రాన్నే మళ్లీ ఉపయోగించారు. ఆ ప్రశ్నపత్రంపై కవర్లో ఉన్న కోడ్ నంబర్ కూడా మార్పు చేయకపోవడం గమనార్హం. దీనితో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయా? కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం […]
Madhavaram Krishna Rao: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి వహించారు. వసంత్ నగర్, కూకట్‌పల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తు, అది ఎవరికి కూడా జాగిరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. […]
Hyderabad: కర్ణాటకలోని బీదర్ నగరంలోని శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బైక్ పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇక దాడి చేసిన వ్యక్తులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో […]
Hyderabad: హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం మూడు అంతస్తుల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో “శుభనందిని చిట్ ఫండ్” బోర్డు తొలగించే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి నాచారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫాగ్ ద్వారా […]