CtrlS AI Data Center: తెలంగాణలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ఎస్ (CtrlS) డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ ప్రాజెక్టుకు కంట్రోల్ఎస్ సంస్థ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను తెలంగాణలో నెలకొల్పే ప్రణాళికను రూపొందించింది. […]
MLC Kavitha: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై, ఇళ్లపై దాడి చేసే వారిని కవిత హెచ్చరించారు. ‘మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అని ఆమె పేర్కొన్నారు. ‘60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు […]
Kidney Racket: హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై పోలీసులు తీవ్రమైన దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నీ రాకెట్ లో పాలుపంచుకున్న అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పాల్గొన్న వైద్యుల కోసం కూడా విచారిస్తున్నారు. ఈ దందా ఎంతకాలంగా కొనసాగుతుందో? ఇప్పటివరకు ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారో అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తిసుకున్నారు పోలీసులు. హాస్పిటల్ నిర్వాహకుడు సంపత్తో పాటు మరికొంత మంది […]
Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్‌లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు […]
Robbery Case: మొదట బీదర్, తర్వాత అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో రోజురోజుకి ఒక కీలక సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల నేపథ్యంలో రూ.93 లక్షలతో పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక అక్కడ కాల్పులు జరిపి డబ్బుతో ఉదయనించిన తర్వాత అనంతరం నిందితులు హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్ లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. నిందుతులని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు […]
Champions Trophy 2025: శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ అద్భుత విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు, టోర్నమెంట్ విజేతగా నిలిచింది. భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఈ గెలుపును అధికారికంగా ప్రకటిస్తూ.. జట్టు సమిష్టి కృషిని కొనియాడింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ […]
Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పెలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బాయిలర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రాత్రి 11 గంటలకు జరిగింది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో భారీ శబ్దాలు వినిపించాయి. పెద్దెతున్న మంటలు ఆకాశాన్నంటాయి. అగ్ని ప్రమాదం తర్వాత నాలుగు ఫైరింజన్లు […]
BBL 2025: బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్‌లో హోబర్ట్ హరికేన్స్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం (జనవరి 21) రాత్రి జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ జరిగిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో మిచెల్ ఓవెన్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల వేగవంతమైన ఇన్నింగ్స్‌లో భాగంగా 15 బంతుల్లో […]
Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి వంటి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారికి ఇప్పుడు వెసులుబాటు కల్పిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో ఈ పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర […]
India vs Malaysia: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ కౌలాలంపూర్‌లోని బ్యుమాస్ ఓవల్‌లో జరిగింది. మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కేవలం 17 బంతుల్లోనే 10 వికెట్ల తేడాతో మలేషియాపై టీమిండియా విజయం సాధించింది. మలేషియా జట్టు కేవలం 14.3 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరపున వైష్ణవి శర్మ కేవలం 5 పరుగులిచ్చి 5 […]