Inter University Games: పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై దాడి జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన క్రీడా ప్రపంచానికి చేదు అనుభవంగా మిగిలింది. మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయం పట్ల క్రీడాకారులు అసంతృప్తిగా ఉండటంతో ఈ గొడవ ప్రారంభమైందని సమాచారం. మదర్ థెరిసా విశ్వవిద్యాలయం, పెరియార్ విశ్వవిద్యాలయం, అలగప్ప విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పంజాబ్‌లో నిర్వహించిన ఉత్తర మండలం అంతర్ […]
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో అక్కడ జొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే, సకాలంలో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక అధికారులు. సమాచారం ప్రకారం.. కుంభమేళా ప్రాంతంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం వల్ల పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలో ఆగి ఉన్న […]
Dead Body On Bicycle: తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల బాలన్ తన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శివగామి (65) మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు. గత నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. కాకపోతే, ఈసారి ఆమె మరణం తరువాత కూడా అతని తల్లిని సైకిల్ పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల […]
Nigerian Army: నైజీరియా సైన్యం శుక్రవారం తన తాజా భద్రతా ఆపరేషన్‌లో 79 మంది ఉగ్రవాదులు, కిడ్నాపర్లను హతమార్చినట్లు వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఈశాన్య నైజీరియాలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల తిరుగుబాటుదరు అలాగే నార్త్-వెస్ట్ ప్రాంతంలో సాయుధ గ్రూపుల దాడులను లక్ష్యంగా చేసుకుని చేపట్టబడింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈశాన్య ప్రాంతంలో దాదాపు 35,000 మంది పౌరులు మరణించారు. అలాగే 2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో, నైజీరియా తమ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. […]
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా, రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తుండగా.. మరోవైపు ఈ […]
VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎమ్‌డిగా పనిచేస్తున్న విసీ సజ్జనార్ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆయన విశేషాలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రజలలో బెట్టింగ్ యాప్స్ పై అవగహన కోసమై పలు కీలక పోస్టులను చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితంలో నాశనం చేసుకోవద్దని ఆయన పలుమార్లు హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతూనే.. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు […]
Minister Kishan Reddy: అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక)లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృక్పథంతో ఉన్నదని తెలిపారు. ఈ దిశగా పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, నోట్ బుక్స్, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి […]
HP: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది. పెట్రోల్, డీజల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే, సిబ్బంది దీనిని ఒక “టెక్నికల్ ప్రాబ్లమ్” […]
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలకు ఘోర ప్రమాదం జరిగింది. నేడు మంత్రి హుజూర్నగర్ నుండి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 15 కార్ల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. Also Read: Kaushik Reddy: గ్రామసభలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి నల్గొండ జిల్లా గరిడేపల్లి వద్ద ఉత్తమ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెంట వెలుతున్న కాంగ్రెస్ నేతల వాహనాలు […]
Kaushik Reddy: నేడు జరుగుతున్న కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సభ కాంగ్రెస్ నాయకులు, BRS నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లిస్ట్‌పై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమయంలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. “మీ హయాంలో ఏమి చేయలేదని, మా ప్రభుత్వం అన్ని చేస్తోంది” అని […]