MLA House Arrest: హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన హౌసింగ్ బోర్డ్ వేలంపై నిరసన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. హౌసింగ్ బోర్డ్ ఇప్పటికే 24 ఫ్లాట్లను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో రెండు ప్లాట్లు 2008 సంవత్సరంలో హెచ్ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించారని తెలిపారు. కానీ, ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ అధికారులు ఆ రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా చూపించి, వేలం […]
Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు తీవ్రత మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. Also Read: […]
Crime News: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆవిడపు రాజన్న అనే వ్యక్తిని తనయుడు సాయి సిద్ధార్థ్ (సిద్దు) హత్య చేశాడు. ఈ హత్య స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సాయి సిద్ధార్థ్ తన తండ్రిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సిద్ధార్థ్ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అయితే, ఈ ఘోరానికి సిద్ధార్థ్తో పాటు మరో ఇద్దరు స్నేహితులు […]
Meerpet Murder Case: మీర్పేట్ న్యూ వెంకటేశ్వర నగర్లో జరిగిన హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించిన భర్త గురుమూర్తి, తన భార్య మాధవిని హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మాధవిని హత్య చేసిన గురుమూర్తి, ఆమె మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూమ్లో కత్తితో ముక్కలుగా చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాత్రూమ్ను పది సార్లు కడిగినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో […]
Massive Fire Incident: హైదరాబాద్ లోని నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియో సమీపంలోని టిఫిన్స్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేశారు. అయితే, మంటలు పక్కనే ఉన్న […]
Grama Sabha: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాల్గవరోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప్ప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,861 గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది మొత్తం లక్ష్యంలోని 85.96 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో 3,130 గ్రామ సభలు, 856 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమాలు గ్రామస్థుల సమస్యలపై చర్చించేందుకు, స్థానిక అవసరాలు గుర్తించేందుకు దోహదపడనున్నాయి. Also Read: Fire Accident: […]
Fire Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు […]
Uttam Kumar Reddy: చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ. 80 కోట్లు ఖర్చు చేసి, నీటిని ఆయకట్టుకు అందజేయాలని ప్రభుత్వ ప్రణాళిక ఉందన్నారు. […]
Hanumakonda: వరంగల్ జిల్లా హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి ముందు ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల ప్రకారం, రెండు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం మొదలవ్వగా.. ఈ గొడవ సమయంలో ఒక డ్రైవర్ మరో డ్రైవర్పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు […]
Harish Rao: సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల కోసం ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాల […]