Minister Kishan Reddy: అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక)లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృక్పథంతో ఉన్నదని తెలిపారు. ఈ దిశగా పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, నోట్ బుక్స్, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాఠశాలల్లో మరిన్ని మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read: HP: పెట్రోల్ పంపులో ఘరానా మోసం.. పోలీసులకు ఫిర్యాదు
మాజీ విద్యావిధానాల కంటే నూతన విద్యావిధానం ద్వారా దేశంలో విద్యార్థులకు మేలు జరుగుతుందని, ప్రాథమిక స్థాయిలోనే ప్రొఫెషనల్ కోర్సులు నేర్పించేందుకు ఈ విధానం మార్గం సుగమం చేస్తుందని మంత్రి అన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడం అవసరమని, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పాఠశాలల్లో నూతన భవనాలను నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ సంబంధించి భూసేకరణ ప్రక్రియను జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నాయని.. అటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంకు సూచించారు. అలాగే అంబర్‌పేట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానిస్తానని ఆయన తెలిపారు.