Mahindra Thar Roxx: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహీంద్రా & మహీంద్రా థార్ రాక్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో లభిస్తోంది. ఈ హిట్ SUVకి కంపెనీ ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. మొత్తం రూ.50,000 వరకు లభించే ఈ ఆఫర్‌లో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.15,000 విలువ చేసే యాక్సెసరీలు అందిస్తున్నట్లు డీలర్‌షిప్ వర్గాలు వెల్లడించాయి. ఇకపోతే థార్ రాక్స్ పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్, 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ వేరియంట్లు లభిస్తాయి. ఈ ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేరుబాక్స్ లతో జత చేయబడ్డాయి. పెట్రోల్ వేరియంట్లలో RWD సిస్టమ్ అందుబాటులో ఉండగా.. డీజిల్ వేరియంట్లలో 4×4 ఆప్షన్ కూడా లభిస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్ ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.23.09 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
Zomato: జొమాటో సంచలన నిర్ణయం.. ఫోన్ నంబర్లతో సహా కస్టమర్ల డేటా షేరింగ్‌కి గ్రీన్ సిగ్నల్..
మహీంద్రా థార్ రాక్స్ ఫీచర్ల విషయానికి వస్తే.. థార్ రాక్స్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, అదే పరిమాణంలోని డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హార్మన్ కార్డన్ 9 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తున్నారు. ఇక భద్రత పరంగా.. ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, అన్ని వీల్స్‌పై డిస్క్ బ్రేకులు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, TPMS, అలాగే ADAS ఫీచర్లలో లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక సాంకేతికతలు ఉన్నాయి. ఈ ఆఫర్లతో మహీంద్రా థార్ రాక్స్ కొనుగోలుదారులకు మరిన్ని లాభాలు అందుబాటులోకి వచ్చినట్లే.
Earthquake: బంగ్లాదేశ్, కోల్‌కతాలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు