Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గాజాలో ఉన్న బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా ఆ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. “అక్కడ మిగిలి […]
Road Accident: సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన గ్వాటెమాలా రాజధానికి సమీపంలోని ప్రాంతంలో జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు నియంత్రణ కోల్పోయి 65 అడుగుల లోతైన ప్రాంతనంలో పడిపోయింది. అందిన సమాచారం మేరకు ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 55 మంది మృతి చెందారు. మరికొంత గాయపడ్డారు. Read Also: Harbhajan-Akhtar: గ్రౌండ్ లోనే బాహాబాహీకి దిగిన హర్భజన్ సింగ్, అక్తర్.. వీడియో వైరల్ స్థానిక అధికారులు తెలిపిన […]
Harbhajan-Akhtar: భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రీడాభిమానులకు పండగే. అయితే ఈ రెండు జట్లు కలిస్తే మాటల తూటాలు, భావోద్వేగాలు, అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు కూడా మామూలే. కిరణ్ మోరే – జావేద్ మియాందాద్, అమీర్ సొహైల్ – వెంకటేశ్ ప్రసాద్ మధ్య జరిగిన ఘర్షణలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో నేటి కూడా సజీవంగా ఉన్నాయి. అయితే హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన మాత్రం కొంచెం విచిత్రం. […]
Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (KTR) రంగరాజన్‌ను వ్యక్తిగతంగా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య. దీన్ని ఎవరు చేసినా, ఏ పేరుతో చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. దేవాలయ సేవలో నిమగ్నమవుతున్న రంగరాజన్, సౌందర్య […]
Divyangjan Rail Card: రైల్వేపాసుల కోసం ఇకపై దివ్యాంగులు రైల్వే కార్యాలయాలు, స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇందుకోసం భారత రైల్వేశాఖ కొత్తగా ఆన్లైన్ పాస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటి నుంచే పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా http://divyangjanid.indianrail.gov.in అనే వెబ్సైట్ ప్రారంభించారు. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్రయాణ సౌకర్యం అందిస్తోంది. రైళ్లు, బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించడంతోపాటు ఛార్జీల్లోనూ […]
MLC Kavitha: జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని ఆవిడ పేర్కొన్నారు. ఐఫోన్ స్థిరమైన పనితీరుకు ప్రాధాన్యం కల్పిస్తే, చైనా ఫోన్ బయటకు బాగుంటుందని.. […]
Supreme Court: సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వారు ఈ పిటిషన్ పెట్టారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ […]
Mahesh Kumar: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ గ్రామంలోని ఓ ప్రైవేటు హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో అవినీతి, రాజకీయ సమస్యలపై స్పందించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు? గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా, […]
Principal Slaps Teacher: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాలలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాఠశాల ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్ తన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రాజేంద్ర పర్మార్‌ను 18 సార్లు చెంపదెబ్బ కొట్టిన వీడియో సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ వివాదం పాఠశాలలో గణితం, సైన్స్ పాఠాలు బోధిస్తున్న రాజేంద్ర […]
Thyroid Food Habits: అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధులలో థైరాయిడ్ సర్వసాధారణం. ఒకవేళ థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే.. కొన్ని హార్మోన్లు అధికంగా లేదా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్‌లో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, థైరాయిడిటిస్ ఇంకా హషిమోటోస్ థైరాయిడిటిస్ కూడా ఉన్నాయి. ఈ సమస్యను నివారించడానికి, మందులతో పాటు ఆహారం విషయంలో కూడా సరైన జాగ్రత్తలు […]