IND vs AUS: ఉత్కంఠ ఫలితంగా సాగిన భారత్ – ఆస్ట్రేలియా సెమి ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో చివరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. దీంతో టీం ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక మ్యాచ్ భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో 84 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు […]
Well Vision Scam: కూకట్పల్లి ప్రాంతంలో వెల్ విజన్ అనే కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి భారీగా మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజల వద్ద నుండి సుమారు రూ. 14 కోట్ల మేరకు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వెల్ విజన్ కంపెనీ వారు ప్రజలకు అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ పెట్టుబడులు పెట్టాలని ఆకర్షించారు. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా.. పెట్టుబడికి బోనస్‌గా గిఫ్ట్‌లు అందిస్తామని కూడా చెప్పి మోసం చేశారు. […]
టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త జూపిటర్ 110cc ను విడుదల చేసింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 OBD-2B కంప్లైంట్ ఇంజిన్‌తో వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో హోండా యాక్టివా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న 110సీసీ స్కూటర్లలో జూపిటర్ ఒకటి. ఇక ఈ స్కూటర్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. హై-ఎండ్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇది కలర్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. దీనికి MapMyIndia సపోర్ట్ […]
Pralhad Joshi: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిసారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ పోస్టులో 2014-15 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి […]
MLC Celebrations: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సంబరాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో మల్క కొమురయ్యతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. Read Also: Obesity Causes: అతిగా తినడం మాత్రమే కాదు.. ఈ తప్పులు కూడా ఊబకాయానికి కారణాలే ఈ సందర్భంగా రాజ్యసభ […]
Obesity Causes: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఊబకాయం (Obesity) ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు ఇవన్నీ బరువు పెరగడానికి ప్రధాన కారణాలు. ఊబకాయం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 4న “ప్రపంచ ఊబకాయ […]
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ కార్మికులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాల చెల్లింపుల కోసం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి – సిద్దిపేట ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు కార్మికులు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ.. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని వాపోయారు. […]
Supreme Court: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (EC)లకు నోటీసులు జారీచేసింది. మార్చి 22 లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ఈ […]
Ambulance Misuse: అత్యవసర పరిస్థితుల్లోనే అంబులెన్స్‌లు సైరన్ వాడాలనే నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక అంబులెన్స్ డ్రైవర్ తన పెంపుడు కుక్కకు ఆపరేషన్ కోసం సైరన్‌తో వెళ్లడం హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం రేపింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సైరన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఈ క్రమంలో పంజాగుట్ట వద్ద అతి వేగంగా, సైరన్లు మోగిస్తూ వచ్చిన ఒక అంబులెన్స్‌ను పోలీసులు ఆపి తనిఖీ […]