Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
- యువకుడి అనుమానాస్పద మృతితో కలకలం
- పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
- పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి
- ఉద్రిక్తంగా మారిన వట్పల్లి పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Watpally Police Station : సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వట్‌పల్లిలోని ఒక దాబాలో పనిచేస్తున్న బీరప్ప (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి పూర్వాపర సమాచారం అందించకుండానే వట్పల్లి పోలీసులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందికి దించేశారని ఆరోపిస్తూ మృతుని స్వగ్రామమైన దరఖాస్తుపల్లికి చెందిన ప్రజలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని వారి అనుమతి లేకుండా ఎలా దించుతారని ప్రశ్నిస్తూ, పోలీసులు దాబా యజమానితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు గుప్పించారు.
Also Read
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన దరఖాస్తుపల్లి గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో వట్పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే పరిస్థితి అదుపుతప్పి, ఆగ్రహంతో ఊగిపోయిన దాడికోరులు పోలీస్ స్టేషన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో స్టేషన్‌లోని కిటికీ అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనుమానాస్పద మృతిపై సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఆధారాలు తుడిచేసే యత్నం చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చేపట్టడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!