హర్యానాలోని పానిపట్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై పొరుగింట్లో ఉంటున్న తండ్రీకొడుకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… పానిపట్‌లోని మోడల్ కాలనీలో నివసిస్తున్న బాలిక ఇంటి పక్కనే అజయ్ అనే యువకుడి ఇల్లు ఉంది. దీంతో అజయ్ తరచూ బాలికను ప్రేమిస్తున్నాని వెంటపడుతున్నాడు. కొన్నాళ్లకు అతడి మాయమాటలను నమ్మిన బాలిక అజయ్‌తో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో ఓ రోజు అజయ్ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ సయయంలో అజయ్ తండ్రి సదర్, అజయ్ సోదరుడు అర్జున్ మత్తుమందు కలిపిన సిగరెట్ తాగాలని బాలికను బలవంతం చేశారు. అనంతరం బాలికపై తండ్రీకొడుకులు వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Read Also: ఛత్రినాక పేలుడు కేసులో కొత్త ట్విస్ట్
రెండు నెలల పాటు తమ ఇంట్లోనే బంధీగా ఉంచుకుని ఆ బాలికపై కామవాంఛ తీర్చుకున్నారు. ఈ క్రమంలో వాళ్లు బాలికను డ్రగ్స్‌కు బానిసరాలుగా చేశారు. అయితే తొలుత బాలిక అదృశ్యమైందని భావించిన ఆమె తల్లిదండ్రులు… మానవ మృగాల నుంచి తప్పించుకుని వచ్చిన బాలికను చూసి ఆశ్చర్యపోయారు. బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి తల్లి ఆరోపించింది. దీంతో సీఎం నివాసానికి వెళ్లగా.. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి అజయ్, సదర్, అర్జున్‌లను అదుపులోకి తీసుకున్నారు.