వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సిటిజన్ షిప్ యాక్ట్‌పై ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కోర్టుకు వివరించారు. ఇది చట్ట విరుద్ధమని వేదుల వెంకటరమణ కోర్టులో వాదించారు. […]
ప్రస్తుతం ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో పాకిపోతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారం రోజులు లాక్‌డౌన్ విధించిందనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్ […]
నిర్మాణ రంగంలో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు అందుకున్న మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఆయనకు గురువారం నాడు తెలంగాణ క్రెడాయ్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా జూపల్లి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ… హైదరాబాద్ నగర ప్రగతిలో కన్‌స్ట్రక్షన్ […]
2021 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ తర్వాత ప్రజలు ఎక్కువ చర్చించుకున్నది… ఇబ్బంది పడింది పెట్రోల్ ధరల విషయంలోనే. ఎందుకంటే దేశంలో ఈ ఏడాది లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 దాటింది. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది రూ.100పైనే ఉంది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు దేశీయ సుంకాలు తోడవడంతో సామాన్యుడు పెట్రోల్ ధరల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర […]
ఏపీలో ప్రస్తుతం సినిమా టిక్కెట్ల రేట్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది కార్మికులు ఆధారపడ్డ సినిమా థియేటర్ల కంటే వాటి పక్కన ఉండే కిరాణాషాప్ వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ హీరో నాని చేసిన కామెంట్లు అధికార పార్టీలో వేడిని పుట్టించాయి. మార్కెట్‌లో ప్రతిదానికి ఎమ్మార్పీ ఉన్నట్లే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే హీరో […]
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని రాష్ట్ర పథకాలుగా జగన్ సర్కారు ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ మండిపడ్డారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జీవీఎల్ వెల్లడించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శలు చేశారు. Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు కేంద్ర పథకాలు అమలు […]
కరోనా పుణ్యమా అని వరుసగా మూడో ఏడాది కూడా ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని రిపోర్టులు అందుతున్నాయి. ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆఫీసులు ఓపెన్ చేయనున్నట్లు ఐటీ ఉద్యోగులకు సమాచారం అందాయి. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చే విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని టాప్ ఎంఎన్‌సీ కంపెనీలు అధికారికంగా […]
హైదరాబాద్ బాచుపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు వీఎన్ఆర్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీ […]
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నాడు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ఆయన కాసేపు కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక టీమ్ తరఫున కబడ్డీ ఆడుతూ కాలు స్లిప్ కావడంతో కింద పడిపోయారు. స్పీకర్ కిందపడగానే ఆయన సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను పైకి లేపారు. Read Also: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా […]
తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తక్షణమే ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్ధతిని అనుసరించాలని ఆయన ప్రభుత్వాన్ని […]