భారతీయులకు క్రికెట్ కేవలం ఆట కాదు… అదో పండగ! అదే ఎమోషనల్ బాండింగ్! అలాంటి క్రికెట్ చరిత్రలో 25 జూన్ 1983కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తొలిసారి భారతీయ క్రికెట్ టీమ్ చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో వరల్డ్ కప్ ను చేజిక్కించుకున్న రోజది! ఆనాటి టోర్నమెంట్ గురించి ఈ తరానికి పెద్దంతగా తెలియదు, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోని ఆ కీలక ఘట్టాన్ని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ’83’ పేరుతో తెరకెక్కించారు. ఈ స్పోర్ట్స్ […]
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జాతిరత్నాలు’ ఫేం హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా పంచ్‌ల పంచ్‌లు వేస్తూ అందరినీ కాసేపు కడుపుబ్బా నవ్వించాడు. సాధారణంగా ప్రతి సినిమాకు ఫైనాన్షియర్స్ ఉంటారని.. కానీ ప్రభాస్ సినిమాకు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారని పంచ్ వేశాడు. అంతటితో ఆగకుండా ప్రభాస్ సినిమాల బడ్జెట్ గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. పార్లమెంట్‌లో హెల్త్ కోసం రూ.500 కోట్లు, ఎడ్యుకేషన్ కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లే […]
హైదరాబాద్ జలసౌధలో గురువారం సాయంత్రం కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కృష్ణా నది పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్‌లో రెండుగా చూపడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ ఆయకట్టును 3 నుంచి 4 లక్షల ఎకరాలకు పెంచారని, కానీ నీటి కేటాయింపులు పెంచలేదని […]
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఇండియాలో పలు చోట్ల ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వేరియంట్ కేసులు తెలుగు రాష్ట్రాలలోనూ నమోదవుతున్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి మూడురోజుల క్రితం ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుడిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. Read […]
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై మంత్రి బొత్స ఇచ్చిన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని.. అలాగే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ… ఎమ్మార్పీ అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అంతే తప్ప.. ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని చురకలు అంటించారు. […]
ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే ప్రజలకు మంచిదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. ‘సినిమా అందరికి అందుబాటులో ఉండాలి. అందుకే ధరలు తగ్గించాం- మంత్రి బొత్స. మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండక్కర్లేదా వైఎస్ జగన్ గారూ. అవి కూడా తగ్గించండి- ప్రజలు’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. Read […]
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న దేశ వ్యాప్తంగా పదో విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఏడాది రైతుల అకౌంట్లలో మూడు విడతలుగా రూ.6 వేలు జమ చేస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. జనవరి 1, 2022న మధ్యాహ్నం 12 గంటలకు […]
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. ఇప్పటికే హీరో నాని వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు స్పందించగా.. తాజాగా మంత్రి కన్నబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ తెగ వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ టీమిండియా క్రికెటర్లను కూడా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాసిన గడ్డంతో ‘పుష్ప’ లుక్‌లో కనిపిస్తూ… ‘పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదే లే’ అంటూ డైలాగ్ చెప్పడం […]
కర్ణాటకలోని మంగుళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన ఓ మత్స్యకారుడి పట్ల సహచర మత్స్యకారులు దారుణంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే… ఏపీకి చెందిన వైల శీను మంగళూరులో మత్స్యకారుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ కనిపించలేదు. దీంతో వైల శీనునే ఆ మొబైల్ దొంగిలించాడని మిగతా మత్స్యకారులు భావించారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఎక్కడ పెట్టావంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. కనీసం వైల శీను చెప్పేది వినకుండా […]