ఈ ఏడాది మొత్తంలోనే ఈరోజు (డిసెంబర్ 21) చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే డిసెంబర్ 21వ తేదీని అత్యంత చిన్నరోజుగా నాసా అధికారులు గుర్తించారు. ఉత్తర అర్ధగోళం మంగళవారం నాడు తన కక్ష్యలో సూర్యుడి నుంచి దూరంగా వంగి ఉన్నందున సంవత్సరంలో అతి తక్కువ రోజుగా అనుభవిస్తుందని వారు తెలిపారు. సూర్యుడి నుండి దూరంగా వంగి ఉన్నందున తక్కువ సూర్యరశ్మిని పొందుతుందని.. దీంతో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుందన్నారు.
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
కాగా అయనాంతం సమయంలో సూర్యుడు సంబంధిత అర్ధగోళాలలోని ప్రదేశాలకు దూరంగా ఉంటూ శనిగ్రహంపై ప్రకాశిస్తాడు. ఆ సమయంలో భూమి అక్షాంశంపై 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 22 వరకు, దక్షిణార్ధగోళంలో జూన్ 20 నుంచి 21 మధ్య ఇలా సంభవిస్తుంది. అదే సమయంలో దక్షిణార్థ గోళంలో పగలు ఏడాది మొత్తంలో సుదీర్ఘంగా ఉంటుంది. ఏమైతేనేం.. ఈరోజు సుదీర్ఘ రాత్రి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. చలితో గజగజమంటున్న వేళ.. కాసింత రిలాక్స్ అయితే సుదీర్ఘ రాత్రిని ఎంజాయ్ చేయవచ్చు.