వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇకపై ప్రజలు తాము ఉన్న చోట నుంచే తమ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకునే విధంగా ప్రజా బంధు పేరుతో నూతన యాప్‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజాబంధు యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఇకపై నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. త్వరలో ఈ […]
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే. కరోనా కారణంగా సంక్రాంతి రేసు నుంచి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాలు తప్పుకోవడంతో ‘బంగార్రాజు’కు అనుకోకుండా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఈ మూవీ ప్రీక్వెల్‌గా వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాల నిడివితో రానుంది. ఈ […]
టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌కు సంబంధించి ఐసీసీ ప్రతి నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన షార్ట్ లిస్టులో టీమిండియా నుంచి మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ నుంచి అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్ ఉన్నారు. Read Also: రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్ న్యూజిలాండ్‌పై […]
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకా తీసుకున్నవారు ఆరు నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కరోనా నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌తో నిర్వహించిన బూస్టర్ డోస్ ఫేజ్-2 ప్రయోగ ఫలితాలను భారత్ బయోటెక్ వెల్లడించింది. Read Also: […]
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ చిత్రపటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా బంగారు పూలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల తమకు ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు […]
పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రీలో భారీస్థాయిలో కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు చిక్కుకుపోయాయి. ఊపిరి ఆడనీయలేనంత దట్టంగా కార్లపై మంచు పేరుకుపోయింది. దీంతో ఆయా వాహనాల్లో ఉన్న వారిలో 22 మంది పర్యాటకులు మరణించారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వందలాది వాహనాలను మంచు నుంచి వెలికితీశామని.. వెయ్యికిపైగా వాహనాలు ఇంకా మంచులోనే కూరుకునిపోయి ఉన్నట్లు వారు వివరించారు. Read Also: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. […]
సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని… ఈ నేపథ్యంలో ఆది, సోమవారాలలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. Read Also: మందు బాటిల్ ముందేసుకుని […]
★ నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం★ ఏపీ: కరోనా దృష్ట్యా నేడు మంగళగిరిలో జరగాల్సిన జనసేన కార్యవర్గ సమావేశం వాయిదా★ అమరావతి: నేడు జరగాల్సిన ఉద్యోగ జేఏసీ సమావేశం వాయిదా… తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసిన ఉద్యోగ జేఏసీ★ హైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర భేటీ★ నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం: వాతావరణశాఖ★ హైదరాబాద్: నేడు హీరో కృష్ణ […]
2021 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి సత్తా చాటిన క్రికెటర్లలో హర్షల్ పటేల్ ఒకడు. ఈ సీజన్‌లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విజేతగా అతడు నిలిచాడు. అయినా ఆర్‌సీబీ జట్టు హర్షల్ పటేల్‌ను రిటైన్ చేసుకోలేదు. కేవలం కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను మాత్రమే ఆ జట్టు రిటైన్ చేసుకుంది. తనను రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలపై హర్షల్ స్పందించాడు. 2022 రిటెన్షన్‌లో తన పేరు ఉండదని తనకు ముందే […]
ప్రధాని నరేంద్ర మోదీకి మెదక్ జిల్లాకు చెందిన 200 మంది చిన్నారులు మూకుమ్మడిగా ఉత్తరాలు రాశారు. వివరాల్లోకి వెళ్తే… తాము చదవుకునేందుకు తమ జిల్లాలో నవోదయ పాఠశాల, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని చిన్నారులు ప్రధాని మోదీని కోరారు. తమ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉత్తరాలలో పేర్కొన్నారు. నవోదయ పాఠశాలలు ఉంటే తమ జీవితాలు బాగుపడుతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే.. కేవలం 10 […]