పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. Read Also: రామకృష్ణ మరో సంచలన సెల్ఫీ వీడియో కాగా రామకృష్ణ సెల్ఫీ […]
ప్రస్తుతం కోవిడ్ అనే పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. 2020 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తిట్టుకునే పేర్లలో కచ్చితంగా కోవిడ్ ఉండి తీరుతుంది. కానీ కోవిడ్ అనే పేరు మనుషులకు ఉంటుందని మనం ఊహించగలమా? అయితే మన ఇండియాలో కోవిడ్ అనే పేరు గల మనిషి ఉన్నాడండోయ్. అతడి పూర్తి పేరు కోవిడ్ కపూర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబై ఐఐటీలో చదువుకున్న కోవిడ్ కపూర్ ప్రస్తుతం బెంగళూరులోని ట్రావెల్ కంపెనీ హాలిడిఫై.కామ్ సహ […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశంలో రోజుకు దాదాపు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈసారి బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని అమెరికా సీడీసీ వెల్లడించింది. ముఖ్యంగా బాధితుల్లో ఐదేళ్లు లోపు చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య పెరుగుతోందంటూ అమెరికా సీడీసీ డేటాను విడుదల చేసింది. 14 రాష్ట్రాల్లోని […]
జోహన్నెస్ బర్గ్ టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ ఓటమికి భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణమని ఆరోపించాడు. రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వల్లే.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ పరుగులు రాబట్టాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతిని హుక్ చేయని ఎల్గార్‌కు.. రాహుల్ డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదన్నాడు. దీంతో డీన్ ఎల్గార్ సులభంగా సింగిల్స్ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడని.. మ్యాచ్ గెలిపించాడని సన్నీ […]
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి సూసైడ్ వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఆరోపణలు రావడం… అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీలో తాజాగా మరో కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ వన్‌టౌన్‌లోని కన్యకాపరమేశ్వరి సత్రంలో విషం తాగి […]
జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ‘వన్ సైడ్ లవ్’ వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ‘రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచీ జనం లవ్ చేయరు బాబూ. నిన్ను లవ్ చేసేది పచ్చ […]
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీ ఆటను, క్యారెక్టర్‌ను ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ ముగిశాక రౌఫ్ ప్రత్యేకంగా […]
తెలుగు రాష్ట్రాలలో పుల్లారెడ్డి స్వీట్స్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. అయితే పుల్లారెడ్డి స్వీట్ షాపుకు హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. రూ.25వేలు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల శంషాబాద్‌లోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్‌లో కొంతమంది కస్టమర్లు స్వీట్లు కొనుగోలు చేశారు. Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు అయితే వారు కొనుగోలు చేసిన మిఠాయిలు పాచిపోయి ఉండటంతో కస్టమర్లు […]
దేశంలో కరోనా కేసులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. వారం కిందటి వరకు ప్రతిరోజూ వేలల్లో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312కి చేరింది. నిన్న 285 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,178కి చేరింది. ప్రస్తుతం దేశంలో […]
కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరు కావడంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే… ఆముదాలవలస మండలం తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని […]