దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో పాపులర్ డైలాగ్ మీకు గుర్తుందా? మొక్కే కదా పీకితే పీకకోస్తా అంటాడు చిరంజీవి. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో తాజాగా చోటుచేసుకుంది. తన పొలంలోని మొక్కను పీకినందుకు 7 ఏళ్ల బాలుడిని 12 ఏళ్ల బాలుడు చంపేశాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా షేక్‌పూర్ గ్రామంలో జనవరి 26న 12 ఏళ్ల బాలుడు తన పొలాన్ని పర్యవేక్షిస్తుండగా అదే గ్రామానికి […]
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఎందుకంటే ఈ హైవేను సూపర్ ఇన్ఫర్‌మేషన్ రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్-బెంగళూరు హైవే సూపర్ హైవేగా వాహనదారులకు సేవలు అందించనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఒకవేళ మీరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు ఎంత సమయం పడుతుంది?, ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి?, ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయి? వంటి కీలక సమాచారాలను డిజిటల్ బోర్డుల రూపంలో హైవే […]
కరోనా నుంచి కోలుకున్నవారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలు ఉన్నట్లు తమ పరిశోధనలో స్పష్టమైందని బ్రిటన్ సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే సాధారణ పరీక్షల్లో ఈ లోపం బయట పడకపోవచ్చని వారు సూచించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పలువురిలో శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. అయితే అది అలసట వల్ల జరుగుతుందా […]
ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్‌టౌన్ […]
కరీంనగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలోని రెడ్డి స్టోన్ వద్ద ఆదివారం ఉదయం వేగంగా వచ్చిన ఓ కారు.. రోడ్డుపక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గుడిసెల్లో నివసిస్తున్న నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మాచారం తెలిసిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ నిర్వహించారు. […]
అగ్రదేశం అమెరికాను మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. అటు రహదారులపైనా మంచు భారీగా కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రజల సంక్షేమం కోసం అమెరికా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మంచు తుఫాన్ ధాటికి ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. Read Also: పగబట్టిన ‘కాకి’.. ఏకంగా ఏడుగురిపై దాడి […]
విజయవాడ నగరంలో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే గుణదల మేరీమాత ఉత్సవాలపై ఈ ఏడాది కరోనా ప్రభావం కనిపిస్తోంది. లక్షలాది మంది హాజరయ్యే గుణదల మేరీ మాత ఉత్సవాలను కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న సందర్భంగా లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం కష్టసాధ్యమని, భక్తులు ఇబ్బందికి గురికాకూడదని నిర్వాహకులు యోచిస్తున్నారు. అందుకే ఉత్సవాలను రద్దు చేయాలని […]
సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్‌లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఇదే చివరి ప్రసంగం కానుంది. ఎందుకంటే ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం.. లోక్‌సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక […]
పాములు పగబట్టడం విన్నాం. కాకులు పగబట్టడం ఎక్కడైనా విన్నామా? అయితే కాకులు కూడా పగబడతాయని కర్ణాటక ప్రజలు వాపోతున్నారు. కాకులు ఎవరిమీద అయినా పగబడితే అవి ఎక్కడున్నా ప్రతీకారం తీర్చుకుంటాయని వివరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామంలో ఓ కాకి పగబట్టి కొందరిపై దాడి చేస్తోంది. దీంతో సదరు కాకికి భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Read Also: అక్కడ పందుల పంచాయతీ.. అసలేం […]