చూస్తుండగానే… ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ నాలుగో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఈసారి యంగ్ అండ్ పాపులర్ సింగర్స్ కృష్ణ చైతన్య, దీపు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైమ్ మేల్ సింగర్స్ వచ్చిన ఈ షోను సాకేత్ ఫుల్ ఆన్ ఎనర్జీతో డబుల్ ఎంటర్ టైన్ మెంట్ తో నిర్వహించాడు. ప్రస్తుతం కుర్రకారు పెదాలపై నాట్యం చేస్తున్న ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ తో షోను ప్రారంభించాడు. రామ్ మిరియాల ట్యూన్ చేసి పాడిన ఆ పాటకు సాకేత్ తనదైన స్టైల్ లో స్టెప్పులేశాడు. కృష్ణ చైతన్య (కేసీ), దీపు గురించి చెబుతూ… ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని దుర్యోధనుడు, కర్ణుడి స్నేహంతో పోల్చడం విశేషం. దానికి తగ్గట్టుగానే తమ అనుబంధం 18 సంవత్సరాల నాటిదని వారిద్దరూ తెలిపారు. అయితే 2006లో వచ్చిన ‘టెన్త్ క్లాస్’ సినిమాలో తొలిసారి ఇద్దరూ కలిసి పాటలు పాడిన విషయాన్ని ఈ వేదిక మీద గుర్తు చేసుకున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఆ సినిమాలోని పాటలు ఈ యంగ్ సింగర్స్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకునే అవసరమే కలగలేదు.
హోమ్ మినిస్టర్స్ మధ్యా చక్కని బాండింగ్!
కృష్ణ చైతన్య వివాహం మృదులతో జరిగింది. తనది ఎరేంజ్డ్ మ్యారేజే అని, కావాలంటే గురువు రామాచారి గారిని అడగొచ్చని చెప్పాడు కేసీ. అతనిది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ గా డిక్లేర్ చేశాడు సాకేత్. ఇక దీపు తన భార్య స్వాతి గురించి చక్కని కితాబిచ్చాడు. మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్పే లక్షణం ఆమెదని అన్నాడు. ఈ ఇద్దరి మధ్య ఎంత చక్కటి స్నేహం ఉందో… వారి భార్యల మధ్య అంతే బాండింగ్ ఉండటం విశేషం. స్వాతి ఏ విషయం గురించి అయినా ముందుగా మృదులతో చెబుతుందని దీపు అన్నాడు. ఇక కేసీకి మంచి సుడి ఉందని, అతనికి ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడే ఛాన్స్ దక్కిందని, తానింతవరకూ ఆయన సంగీత దర్శకత్వంలో పాడలేకపోయానని దీపు చెప్పాడు. ఈసారి కొత్తగా గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా తెలుగు పాటలను అనువదించి, ఆ సాంగ్ ఏమిటో గెస్ చేయమనే సాకేత్ కోరాడు. అయితే… పాటలను గుర్తించడంలో వీరద్దరూ కాస్తంత తడబడ్డారు. ఇక మోర్ ఫన్నీగా సాగిన ఎపిసోడ్ మీమ్స్ అండ్ డబ్ స్మాష్! తనను కొందరు నారా లోకేష్ అనుకుంటారని కేసీ చెబితే, భీమవరంలో ఓ సంగీత విభావరికి వెళ్ళినప్పుడు అక్కడి కాలేజ్ స్టూడెంట్ ఒకామె తన జుత్తును టచ్ చేయాలని కోరుకుందని దీపు తెలిపాడు. వారిద్దరూ చేసిన డబ్ స్మాష్ లను ప్లే చేసి మోర్ ఫన్ క్రియేట్ చేశాడు సాకేత్. ఇక ఫోటోలు చూసి సాంగ్స్ ను గుర్తు పట్టే ఎపిసోడ్ లో దీపు రెండు పాటలను కరెక్ట్ గా గెస్ చేసి తన ఆధిక్యత చాటుకున్నాడు.
ఆ ఇద్దరినీ అవాయిడ్ చేస్తామన్న మేల్ సింగర్స్!
‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’లో టఫ్ ఎపిసోడ్ ఏదైనా ఉందంటే… అది ఆఖరిలో వచ్చేది. లవ్ టూ సింగ్, అవాయిడ్, కాంప్రమైజ్ రౌండ్ లో ఏ సింగర్ అయినా ఒకటికి పదిసార్లు ఆలోచించి గాని సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. అందులో శ్రావణ భార్గవిని అవాయిడ్ చేస్తానని, గాయత్రితో కాంప్రమైజ్ అయ్యి పాడతానని, ఇక కీర్తనా శర్మతో ఇప్పటి వరకూ పాడలేదు కాబట్టి ఆమెతో కలిసి పాడటం అనేది తనకు లవ్ టూ సింగ్ అని కేసీ తెలిపాడు. ఇక గీతా మాధురి పక్కన లేదా స్టేజీ మీద నిలబడితే ఆమె విగ్రహానికి మిగిలిన వారెవరూ వీక్షకులకు కనబడరని, అందుకే ఆమెను అవాయిడ్ చేస్తానని దీపు చెప్పాడు. మాళవిక తో పాడటాన్ని లవ్ చేస్తానని, లప్సికాతో కాంప్రమైజ్ అయ్యి పాడతానని తెలిపాడు. ఎపిసోడ్ మధ్యలో ‘రఘువరన్ బీటెక్’లోని మదర్ సెంటిమెంట్ సాంగ్ పాడి దీపు అందరినీ అలరించాడు. మొత్తం మీద సాకేత్ ముందే చెప్పినట్టు ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ నాలుగో ఎపిసోడ్ సాగింది. మరింకెందుకు ఆలస్యం… క్రింద లింక్ క్లిక్ చేసి ఈ ప్రోగ్రామ్ ను మీరూ చూసి ఆనందించండి.