గుంటూరు జిల్లా పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ పనులు చేపట్టాలంటూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ నేత కోడెల శివరాం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అంతకుముందు రాజుపాలెం నుంచి దేవరంపాడు గుడి వరకు పాదయాత్రను ప్రారంభించేందుకు ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లిన కోడెల శివరాం టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కోడెల శివరాం పాదయాత్ర చేయకుండా తొలుత ఎన్టీఆర్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే కార్యాలయం నుంచి తప్పించుకున్న శివరాం.. తాలూకా సెంటర్‌కు వెళ్లి అక్కడ బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.