IPL 2022: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులకు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త అందించింది. ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాలలో చూసేందుకు అభిమానులకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం 25 శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటన చేసింది. దీంతో రెండేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లను క్రీడాభిమానులకు స్వయంగా వీక్షించే అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మార్చి 23 మధ్యాహ్నం నుంచి టిక్కెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది.
కాగా ఐపీఎల్ 15వ సీజన్లో మొత్తం 65 రోజుల్లో 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. మార్చి 26న వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్‌ల చొప్పున, నవీ ముంబైలోని బ్రబౌర్న్, ఎంసీఏ స్టేడియాలలో 15 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా వేదికలను ఐపీఎల్ పాలక మండలి ఖరారు చేయాల్సి ఉంది.
Also Read
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
- IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
తాజావార్తలు
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!