Medicine Prices: సామాన్యులపై మరో భారం.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఔషధాల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ ధరలు, వంటనూనె ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి చాలవు అన్నట్లు మనిషి అనారోగ్యం బారిన పడితే కొనుగోలు చేసే ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్ ధరలు 10.7 శాతం పెరగనున్నట్లు తెలిపింది. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో సహా అవసరమైన మందుల ధరలు పెరగబోతున్నాయి.

ఈ నేపథ్యంలో జ్వరం, ఇన్ఫెక్షన్స్, గుండె జబ్బులు, హైబీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా చికిత్సకు ఉపయోగించే ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రజలు ఎక్కువగా వినియోగించే పారాసిటమాల్, ఫెనోబర్బిటోన్, అజిత్రోమైసిన్, సిఫ్రాన్, హైడ్రోక్లోరెడ్, మెట్రిండజోల్ వంటి మందుల ధరలు ప్రజలకు భారం కానున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం సవరించినట్టు ఎన్‌పీపీఏ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఔషధాల తయారీ ఖర్చులు కూడా పెరగడంతో వాటి ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్లో భారీగా ఉద్యోగాల కోత
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!