క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 15 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలిసారిగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగబోతోంది. అయితే కోల్‌కతా జట్టు ముగ్గురు విదేశీయులనే జట్టులోకి తీసుకోవడం గమనార్హం. శ్యామ్ బిల్లింగ్స్, రస్సెల్, నరైన్‌లను మాత్రమే తుది జట్టులో స్థానం కల్పించింది.
మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ కాన్వే, బ్రావో, ఆడమ్ మిల్నే, శాంట్నర్ రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. చెన్నై జట్టుకు కూడా తొలిసారిగా రవీంద్ర జడేజా నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే మైదానం ఆతిథ్యమిస్తోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణే నగరాల్లోనే నిర్వహించనున్నారు.
జట్ల వివరాలు
చెన్నై: రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, ఉతప్ప, అంబటి రాయుడు, ధోనీ, శివం దూబె, శాంట్నర్, బ్రావో, ఆడమ్ మిల్నే, దేశ్‌పాండే
కోల్‌కతా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రహానె, నితీష్ రానా, శ్యామ్ బిల్లింగ్స్, రసెల్, నరైన్, జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి