చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని సోమవారం నాడు పోలీసులు అడవిలో గుర్తించారు. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవిత కుమార్తె జోషిక (4) శనివారం సాయంత్రం ఇంటి నుంచి ఆడుకుంటూ బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా బాలిక దుస్తులు చూపగా జాగిలం ఓ అటవీ ప్రాంతంలో ఆగింది. దీంతో పోలీసులు అటవీ ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు జోషికను అంబాపురం అటవీప్రాంతంలో పోలీసులు గుర్తించారు. నాలుగేళ్ల పాప అంతటి అటవీప్రాంతంలో 36 గంటల పాటు ధైర్యంగా గడిపిందని.. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు అలసటగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ముళ్లచెట్లు గీసుకుని పాపకు గాయాలైనట్లు తెలిపారు. పాప ఆరోగ్యం సాధారంగానే ఉందన్నారు.
Rains: ఏపీకి ఐఎండీ చల్లని కబురు.. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు