Repalle Case: రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్ రేప్.. బాపట్ల జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్ల జిల్లా రేపల్లెలో వివాహితపై అత్యాచారం కేసుపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పందించారు. రేపల్లె రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటిగంటకు మద్యం మత్తులో ముగ్గురు యువకులు భార్యాభర్తల వద్దకు వచ్చారని.. సదరు యువకులు టైం అడిగితే భార్యాభర్తలు వాచ్ లేదని చెప్పడంతో దాడి చేసి నగదు లాక్కున్నారని తెలిపారు. భర్తపై దాడి చేస్తుంటే భార్య అడ్డుపడిందని.. నిందితులు వివాహితను పట్టుకుని అత్యాచారం చేశారని.. ఇద్దరు యువకులు అత్యాచారం చేయగా.. మరొకరు సహకరించారని ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే భర్త సమీపంలోని రేపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోలీసులు వెహికల్ ద్వారా సైరన్‌తో రావడంతో నిందితులు పరారయ్యారని పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటలకు నిందితులను గుర్తించామన్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించామని.. ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ముగ్గురు నిందితులలో ఒకరు గతంలో ఓ చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడని.. కేసులో సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించామన్నారు. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని.. నిందితులపై 376(డి), 394, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బాధితురాలిది ప్రకాశం జిల్లా కావడంతో చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!