ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి జగన్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. జగన్ మూడేళ్ల పాలనలో ఏపీ పలు రంగాల్లో మంచి అభివృద్ధి సాధించిందని పరిమళ్ నత్వానీ ట్వీట్ చేశారు. జగన్ డైనమిక్, విజనరీ లీడర్ అంటూ ప్రశంసలు కురిపించారు.
Congratulations to Sh @ysjagan on completing 3 momentous years as @AndhraPradeshCM. Under your dynamic & visionary leadership, @YSRCParty govt has put #AndhraPradesh on track for unparalleled growth through various pathbreaking initiatives. #3YearsForYSJaganAneNenu @VSReddy_MP pic.twitter.com/SH92k0A00g
— Parimal Nathwani (@mpparimal) May 30, 2022
మరోవైపు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తల ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయమన్నారు. జగన్ సీఎంగా 30 ఏళ్లు ఉండాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు చేసిన అప్పులను తీరస్తూ సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు.